ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!

frame ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!

murali krishna
టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. విభిన్న కథా చిత్రాలు ఎన్నో వచ్చి మనసు దోచుకుంటున్నాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే కొత్త దర్శకులు, యంగ్ హీరోలు సరికొత్త కథాంశాలతో వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. రీసెంట్ గా వరుసగా వివిధ జోనర్లలో వచ్చిన చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. కంటెంట్ ఉన్న సినిమాలకు జేజేలు కొడుతున్నారు. ఈ క్రమంలో కమర్షియల్ సినిమా అనే పదానికి అర్థం మార్చేస్తున్నారని టాలీవుడ్ హీరోలు అంటారు. కమర్షియల్ సినిమాల్లో పెర్ఫార్మన్స్‌పైనే హీరోలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అటువంటి కథలకే తమ నటనతో కమర్షియల్ స్టామినా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన హీరోలు మాస్ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు .. రంగస్థలం నుంచి ఈ ట్రెండ్ మరింత మొదలైంది . ఇక రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో రంగస్థలం లాంటి సినిమా సుకుమార్ అనౌన్స్ చేసినప్పుడు చిత్ర పరిశ్రమ అంతా షాక్ అయింది . కానీ సినిమా రిలీజ్ అయ్యాక .. తన నటనతో అందరినీ షాక్ అయ్యేలా చేశాడు చరణ్.ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే పుష్ప కోసం అల్లు అర్జున్ను అలాగే మార్చేశాడు సుకుమార్.ఇక పుష్ప తో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు తాజాగా పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు.ఇదే ఫార్ములా తో మిగిలిన హీరోల లో ఎన్టీఆర్ దేవర తో ఫుల్ మాస్ ఇమేజ్ ని చూపించాడు.ఇక గత సంవత్సరం నాచురల్ స్టార్ నాని దసరాతో ఇదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ఇక ఇప్పుడు మెగాస్టార్చిరంజీవి కూడా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ మాస్మూవీ చేయబోతున్నాడు. మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మార్పు మంచికే అని అంటున్నారు ఆడియన్స్.చూడాలి మరి ఇటువంటి మాస్ ఎలిమెంట్స్ ని మన ప్రేక్షకులు ఎప్పటి వరకు అందరిస్తారో. ఇంకా ఏఏ హీరో లు ఈ బాటలో నడుస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: