టాలీవుడ్ హీరోలూ ఫైర్ కాదు.. మిస్ ఫైర్ ...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ స్టార్ హీరోలు వాళ్లు... వాళ్ల సినిమా వస్తోంది అంటే బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో జాత‌ర ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఎప్పుడూ అభిమానులు వారి విష‌యంలో ఎన్ని ఆశ‌లు పెట్టుకున్నా వాళ్లు మాత్రం నిరాశపరుస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ మొద‌ల‌య్యాక స్టార్ హీరోలు ప్ర‌తి ఏడూ బిగ్ స్క్రీన్‌పై క‌నిపించ‌డం గ‌గ‌నం అవుతోంది. ఎవ‌రిని చూసినా మినిమం రెండు, మూడేళ్లు మొహం చాటేస్తోన్న ప‌రిస్థితి. ప్ర‌తి సారి వేదిక‌ల‌పై యేడాదికి రెండు .. మూడు సినిమ‌లు చేస్తాం అంటూ చెపుతుంటారు. కానీ చేతుల్లోకి వ‌చ్చే స‌రికి ఒక్క‌టి కూడా చేయ‌డం లేదు.

మెగాస్టార్ చిరంజీవి , నంద‌మూరి బాల‌య్య , ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ , యంగ్ హీరో సాయిదుర్గ తేజ్.. అలాగే మ‌రికొంత మంది నుంచి ఒక్క సినిమా రాలేదు. ఈ హీరోలు అంద‌రూ ఈ సంవత్సరాన్ని సున్నాతో ముగించారు. రీఎంట్రీలో స్టార్టింగ్‌లో జెట్ స్పీడ్‌తో సినిమాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి... అస‌లు కుర్ర హీరోలే కుళ్లుకునేలా దూసుకెళ్లారు. గ‌తేడాది వాల్తేరు వీర‌య్య తో హిట్ కొట్టి.. భోళా శంక‌ర్ తో నిరాశ ప‌రిచారు. బోలాశంకర్ తర్వాత విశ్వంభర సినిమాను మొదలు పెట్టాడు.. 2024లో వ‌స్తుంద‌నుకున్న సినిమాను 2025 స‌మ్మ‌ర్ కు గాని రాదు.

మెగా మేనల్లుడు సాయిదుర్గ్ తేజ్ పరిస్థితి అంతే ... విరూపాక్ష తర్వాత మ‌ళ్లీ మెర‌వలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఈ యేడాది సినిమా రాలేదు. చ‌ర‌ణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్ మొదట డిసెంబర్ లో రిలీజ్ అవుతుందనుకున్నా వచ్చే ఏడాది జనవరికి వెళ్లి పోయింది. ఇక బాల‌య్య గ‌తేడాది వీర‌సింహారెడ్డి - భ‌గ‌వంత్ కేస‌రి రెండు సినిమా ల‌తో అల‌రించారు. ఈ యేడాది ఒక్క సినిమా రాలేదు. డాకు మహారాజ్ కూడా డిసెంబర్ ను టార్గెట్ చేసినా.. చివ‌రికి సంక్రాంతి రేస్ లో నిలిచింది. ప‌వ‌న్  ఎన్నిక‌ల కార‌ణంగా బ్రేక్ తీసుకున్నాడు. వ‌చ్చే యేడాది మాత్రం ఓజీ - హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: