పుష్ప-2 : సుక్కు చెప్పింది నిజమే.. సినిమాలో కథ లేదు?

praveen
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా 50 దేశాలలో రిలీజ్ అయింది ఈ మూవీ. అయితే పుష్ప అనే మూవీ ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప-2 అనే సినిమా వచ్చింది అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా ఒక మూవీ సూపర్ హిట్ అయినప్పుడు ఆ మూవీకి సీక్వల్ గా వచ్చిన సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు పుష్ప 2 మూవీ పై కూడా అదే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మొదటి పార్ట్ లో లాగానే అద్భుతమైన కథ ఉంటుందని అల్లు అర్జున్ యాక్షన్ తో ఇరగదీస్తాడని అభిమానులు అనుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ఆత్రుతతో అటు థియేటర్ కు వెళ్లారు. కానీ కొంతమంది ప్రేక్షకులు మాత్రం నిరాశ చెందారు. ఎందుకంటే అల్లు అర్జున్ యాక్టింగ్ బాగున్నప్పటికీ సినిమాలోకి మాత్రం కథ లేదు.


 పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ చెప్పిన ఒక మాటను అటు సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ఏం చెప్పాడంటే.. వాస్తవానికి నా దగ్గర కథ లేదు. కానీ అల్లు అర్జున్ కోసమే ఈ సినిమా చేశాను అంటూ చెప్పాడు సుకుమార్. అయితే సినిమా చూసి వచ్చిన తర్వాత కొంతమంది ప్రేక్షకులు సుకుమార్ చెప్పింది నిజమే సినిమాలో కథ లేదు కేవలం అల్లు అర్జున్ కోసం మాత్రమే సినిమా చూడొచ్చు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ నటనకి అటు ఇంకొంచెం బలమైన కథ తోడైతే ఈ సినిమా మరింత పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉండేది అని సగటు ప్రేక్షకుడు మనసులు అనుకుంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: