పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అయ్యే అప్డేట్ .. ముగ్గురు ఖాన్లు కలిసినా రానంత కిక్కు ...!
అయితే ఇప్పటికే షారుక్ ఖాన్ , యాష్ కాంబినేషన్ లో సినిమా గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కేజిఎఫ్ , కేజీఎఫ్ 2 తర్వాత చేస్తున్న టాక్సిక్ లో కీలకమైన గెస్ట్ పాత్రలో షారుక్ ఖాన్ నటిస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే కేజిఎఫ్ 3 లోను షారుక్ ఖాన్ విలన్ గా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేయగలరని అభిమానులు నమ్ముతున్నారు.. ఖాన్‌తో కలవడం వల్ల దక్షిణాది స్టార్ యాష్ కి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరింత క్రేజ్ పెరుగుతుందని అలాగే షారుక్ ఖాన్ పఠాన్ 2లో యాష్ కూడా గెస్ట్ రోల్ లో నటించేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్ లో షారుక్ ఖాన్ , యాష్ కలవడంతో ఈ ప్లానింగ్ పై మరిన్ని ఊహగానాలు మొదలయ్యాయి.
ఇక ఈ సంవత్సరం షారుక్ ఖాన్ తన కెరీర్ లోనే ఎన్నో గొప్ప విజయాలను బ్యాక్టీబ్యాక్ అందుకున్నారు . అలాగే బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేశారు. అదే సమయంలో ఇండస్ట్రీ రికార్డ్ హిట్ చిత్రాలలో నటించిన యష్ తో షారూఖ్ కలయిక గొప్ప సహకారాన్ని సూచిస్తుందని అభిమానుల్లో టాక్ వినిపిస్తోంది. అయితే షారూఖ్ - యష్ కలయికతో రాజుకునే ఫీవర్ కి ప్రభాస్ యాడైతే పుట్టుకొచ్చే ఫీవర్ ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవచ్చు. భారతదేశంలోని మూడు విభిన్న భాషల నుంచి బిగ్గెస్ట్ స్టార్స్ కలిసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులు బ్రేకవ్వడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు .