బాహుబలి కాదు దానికి అమ్మ మొగుడు లాంటి హిట్ ఈ పుష్ప2..ఏమంటారు రా బన్నీ ఫ్యాన్స్..!
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన పుష్ప2 సినిమా కొద్ది గంటల క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మనకు తెలిసిందే సినిమా రిలీజ్ కి ముందు కూసింత నెగటివ్ టాక్ వస్తుందేమో అనే విధంగా ట్రోలింగ్ చేశారు జనాలు. అయితే పుష్ప మొదటి బొమ్మపడగానే అందరి నోరులు మూత పడ్డాయి. సినిమాలో ఇది నెగటివ్ అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా లేదు .
అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఓ రేంజ్ లో హైప్ ఇచ్చేస్తున్నారు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా అంటూ అందరూ తెలుగు ఇండస్ట్రీ పేరుని చెప్పుకొని ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు గౌరవంగా భావిస్తున్నారు అని .. ఇప్పటినుంచి బాహుబలి సినిమా కాదు పుష్ప2 సినిమా గురించి చెప్పుకుంటారు అని .. ఆ రేంజ్ లో బన్నీ పర్ఫామెన్స్ ఉంది అని ..మరీ ముఖ్యంగా బన్నీ జాతర ఎపిసోడ్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయి అని ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా ఇలా చేయలేదు అంటూ ఓ రేంజ్ లో బన్నీ పుష్ప2ను పోగిడేస్తున్నారు . అంతేకాదు బాహుబలిని మడత పెట్టే రికార్డ్స్ పుష్ప2 సాధిస్తుంది అని డౌట్ లేదు పక్క అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో పుష్ప2 మూవీ టాక్ బాగా వైరల్ గా మారింది..!