స్టేజ్ ఎక్కిన బన్నీ ఆ ఒక్క మాట మాట్లాడితే ఎంత బాగుండేదో..తప్పు చేశావ్ బ్రో..?

Thota Jaya Madhuri
మేము తోపు అంటే మేము కత్తి.. మేము తురుము అనే రేంజ్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ పోట్లాడుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే కామన్ మెగా-అల్లు ఫ్యాన్స్ కూడా ఉన్నారు.  ఎందుకు ఈ గొడవలు ..? ఎవరో ఒకరు తగ్గి సర్దుకుంటే పోలేదా..? మనం మనం ఒకటే కదా..?  ఎప్పటికైనా మనం మనం ముఖాలు చూసుకోవాలి కదా ..? అంటూ మాట్లాడే జనాలు కూడా ఉన్నారు . మరీ ముఖ్యంగా కామన్ గా ఉండే అల్లు - మెగా ఫాన్స్ బన్నీని సైతం కొంచెం కోపం తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు .


అసలు జరిగిన గొడవ ఏంటో ..? లోపల తగాదాలు ఏంటో..? ఎవరికి తెలియదు. బయట ఫ్యాన్స్ మాత్రం మీ ఇద్దరి కుటుంబాలు పట్ల చాలా చాలా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ వస్తూ ఉంటారు.  మీరు అందరికీ రోల్ మోడల్ గా నిలవాలి అలాంటి మీరే ఇలా ఇంటిగుట్టును బయట పెట్టుకుంటారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు మెగా ఫ్యామిలీ పుష్ప2 పై స్పందించకపోవడం అందరికీ కోపం తెప్పిస్తుంది.  అదే విధంగా పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న హైదరాబాద్ లో జరిగింది. ఆ ఈవెంట్లో స్టేజ్ పైకి వచ్చిన బన్నీ తన పడిన కష్టం గురించి మాట్లాడాడు. అదేవిధంగా మెగా ఫ్యామిలీ హీరోస్ గురించి కూడా ఒక్క మాట మాట్లాడి ఉన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది అని..


 మిగతా స్టేట్స్ లో బన్నీ మాట్లాడకపోయినా పెద్దగా ప్రాబ్లం లేదు కానీ తెలుగు స్టేట్స్ లో తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడకపోయేసరికి మెగా ఫ్యాన్స్ కి కోసం తెపిస్తుంది . అల్లు అర్జున్ ఒక్క మాట మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడి ఉంటే అసలు ఈ తలనొప్పులే వచ్చిండేటివి కాదు అని.. మెగా వర్సెస్ అల్లు  వార్ కి  ఫుల్ స్టాప్ పడిపోయి ఉండేది అని భావిస్తున్నారు. మరొక పక్క బన్నీ ఫాన్స్ కూడా ఇదే విధంగా రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు . చిరంజీవిని పిలిచినప్పుడు రాను అని అనకుండా షోకి ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అంటూ అలాంటి వాళ్లకే కౌంటర్స్ వేస్తున్నారు . సోషల్ మీడియాలో జరిగే మాటలవార్ చూస్తుంటే అల్లు వెర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య ఇప్పుడప్పుడే ఇలా సర్దుమనిగేలా లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: