మెగాస్టార్ బ్లాస్టింగ్ లైన‌ప్‌... నెక్ట్స్ సినిమాల ద‌ర్శ‌కుల లిస్ట్ కేకో కేక‌...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
మన టాలీవుడ్ లెజెండ్రీ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు .. చిరంజీవి నుంచి తన రేంజ్ సినిమాలు పడాలి అని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. తర్వాత చిరంజీవి నుంచి వాల్తేరు వీర‌య్య లాంటి మంచి హిట్ సినిమా పడింది. ఆ సినిమాతో చిరంజీవి తన స్టామినా ఏంటో చూపించి భారీ లాభాలు అందించారు. అయితే అది కూడా మెగా అభిమానులకు ఏమాత్రం సరిపోలేదు. ఆ వెంటనే భోళాశంకర్ పెద్ద డిజాస్టర్ అయింది. ప్రస్తుతం మ‌ల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర లాంటి భారీ సోషియో పాంట‌సీ సినిమా చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత ఏ సినిమాలు ? చేస్తున్నారు . . ఏ డైరెక్టర్ తో చేస్తారు ?అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ తరుణంలో మెగాఫ్యాన్స్ అందరికీ బాస్ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్‌ వచ్చేసింది.

చిరంజీవి లైనఫ్లో యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ... నాని నిర్మాతగా భారీ సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్‌ చేసి ఒక రేంజ్ కిక్ ఇచ్చారు. దీనికే ఇలా అంటే నెక్స్ట్ సినిమాలు కూడా ఊహించని దర్శకులతో ఉన్నాయి. వాటిల్లో అయితే వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావి పూడి తో ఓ సాలిడ్ ఎంటర్టైనర్ ఉంది. అలాగే సిసలైన ప్రాజెక్ట్ మెగాస్టార్ వీరాభిమాని పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. దీంతో మెగాఫ్యాన్స్ కు మాత్రం చిరు లైన‌ప్ ఇప్పుడు ఫుల్ మిల్స్ పెట్టినట్టు అయింది. ఇదే తమకు తమ బాస్ నుంచి కావాల్సింది అంటూ మెగా అభిమానులు సోష‌ల్‌ మీడియాలో కామెంట్ల‌తో మంచి జోష్లో ఉన్నారు. ఇక విశ్వంభ‌ర సినిమా ను ముందుగా సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు అది స‌మ్మ‌ర్‌కు వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: