'సన్నీ' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్న హాట్ బ్యూటీ.!

FARMANULLA SHAIK
సన్నీ లియోనీ దెయ్యంగా నటించిన మూవీ మందిర. గత నెల చివరి వారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. టైటిల్ రోల్లో సన్నీ నటించిన ఈ మూవీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో 15 రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.సన్నీ లియోనీ లీడ్ రోల్లో నటించిన మందిర మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. అయితే ఇప్పుడీ మూవీని గురువారం డిసెంబర్ 5 నుంచే ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం డిసెంబర్ 2 తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది."సన్నీతో గేమ్ సరదా కాదు జాగ్రత్త మందిర ఆహాలో డిసెంబర్ 5న ప్రీమియర్ కానుంది.అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఈ విషయాన్ని తెలిపింది. చాలా కాలం పాటు ప్రొడక్షన్ లోనే ఉన్న ఈ మందిర మూవీ మొత్తానికి గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చినా వాళ్ల నుంచి సరైన ఆదరణ లభించలేదు. అసలు చాలా మందికి ఇలాంటి ఒక సినిమా వచ్చిందనే తెలియలేదు.మందిర మూవీ స్టోరీ ఏంటంటే

సన్నీ లియోనీ నటించిన మందిర మూవీని ఆర్.యువన్ డైరెక్ట్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మందిర అనే దెయ్యం పాత్రలో సెక్స్ బాంబ్ సన్నీ నటించడం విశేషం. ఈ మూవీ ట్రైలర్ కూడా గత నెల 12న రిలీజై ఆసక్తి రేపింది. గత జన్మలో అనకొండపురం అనే రాజ్యానికి ఓ యువరాణి అయిన మందిర.ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది.అసలు ఆమె కథేంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.కామెడీకి హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోడించి మందిర మూవీని తెరకెక్కించారు. సన్నీని దెయ్యం రోల్ తోపాటు ఆమెకు అలవాటైన గ్లామరస్ రోల్లోనూ మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు. సతీష్, యోగి బాబులాంటి వాళ్లు కూడా ఇందులో నటించారు. సన్నీ లియోనీతో బాగానే ప్రమోషన్లు నిర్వాహించాలని చూసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మందిర మూవీ థియేటర్లలో రిలీజైన 13 రోజుల్లోనే ఆహా వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమాను చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: