నైజాంలో తగ్గను... ఏపీలో అస్సలు తగ్గనంటోన్న బన్నీ.. షాకింగ్ లెక్కలు...!
ఇక ఆరో తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ కూడా పైన చెప్పుకున్న టిక్కెట్ రేట్లు పెంపు కేటాయించారు. నైజాంలో అయితే ఏకంగా 19 రోజులు పాటు కంటిన్యూగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు రాగా ... ఏపీలో వరుసగా 13 రోజులు పాటు రేట్లు పెంచుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఓ సినిమాకు ఈ స్థాయిలో టికెట్లు పెంపుపై ప్రత్యేక అనుమతి ఇవ్వటం ఇదే తొలిసారి. ఇంతకు ముందు రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కల్కి - దేవరతో పోలిస్తే పుష్ప 2 కు భారీగా రిలాక్సేషన్ ఇచ్చినట్లు అయింది. మరి ముఖ్యంగా బెనిఫిట్ షో విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక కీలకమంత్రికి మైత్రి మూవీస్ సంస్థలో కొంత భాగస్వామం ఉందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఆ మంత్రి చేసిన లాబీయింగ్‌తో ఏపీలో ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచారన్న ప్రచారం కూడా ఉంది.