పుష్ప 2 రిలీజ్ వేళ బన్నీకి మరో షాక్.. టైం చూసి దెబ్బ కొట్టిన తెలుగుహీరో..!?
మిగతా మెగా హీరోస్ అందరూ చాలా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. రామ్ చరణ్ - మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ ఎవరు కూడా పుష్ప2పై టంగ్ స్లిప్ అయ్యింది లేదు ..దారుణంగా మాట్లాడింది లేదు ..ట్వీట్ చేసింది లేదు . కానీ నాగబాబు మాత్రం పరోక్షంగా చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు అందరికి మండిపోయేలా చేసింది అంటున్నారు బన్నీ అభిమానులు . అంతేకాదు నాగబాబు పై ఫుల్ రేంజ్ లో మండి పడిపోతున్నారు .
"నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావు అని నీకు తెలిస్తే ..నువ్వు గుర్తిస్తే ..వెంటనే ని దారిని మార్చుకో .. లేదంటే చాలా దెబ్బ తింటావు ..నువ్వు ఆలస్యం చేసే కొద్ది నువ్వు నిజంగా ఎక్కడి వాడివో అక్కడికి వెళ్లడం మరింత కష్టంగా మారుతుంది " అనే స్వామి వివేకానంద కోట్ ని నాగబాబు తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు . బన్నీ ఏ విషయంలో మెగా హీరోస్ టచ్ చేయకపోయినా కావాలని ఇలా బన్నీను టార్గెట్ చేస్తూ కొందరు మెగా హీరోస్ చేస్తున్న ట్వీట్స్ బన్నీ ఫ్యాన్స్ కు మండిపోయేలా చేస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన పుష్ప2 సినిమా డిసెంబర్ 5వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . అంతేకాదు ఈ సినిమా 1500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ . చూడాలి మరి బన్నీ ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో..??