అల్లు అర్జున్ కు పెద్ద టాస్క్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ప్రభాస్ ను బీట్ చేయాల్సిందే..?
ఇదిలా ఉండగా పుష్ప 2 విడుదలకు ముందే బాహుబలి- 2 రికార్డులు బద్దలు కొడుతుంది. అయితే 'పుష్ప 2' మూవీ తెలుగు రాష్ట్రాలలో అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వనుంది. బన్నీ సినిమా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. అయితే బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు అవుతుందని సమాచారం. ఇది ఇప్పుడు అల్లు అర్జున్ కు పెద్ద టాస్క్ గా మారింది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 220 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు 'పుష్ప 2' మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే బాహుబలి సినిమాను మించిన కలెక్షన్స్ రాబట్టాలి.
అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచినప్పటికీ.. ప్రభాస్ సినిమాను బీట్ చేయడం అంతా సులువు కాదు. ఇక పోతే పుష్ప 2 సినిమా రన్ టైమ్ మూడున్నర గంటల పాటు ఉంది. స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రేక్షకులను అన్నీ గంటలు ఎంటర్ టైన్ చేస్తాడా లేదా అనేది చూడాలి మరి. అలాగే భారీ కలెక్షన్స్ రాబట్టి బాహుబలి సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి.