విడాకుల తర్వాత ఫస్ట్ టైం సమంత కు కాల్ చేసిన ఆ తెలుగు హీరో.. పాత బంధం మళ్లీ చిగురిస్తుందా..?
కానీ సమంత మాత్రం ప్రేమ అనేది ఒకసారి పుడుతుంది అని ..నా లైఫ్ లో ఇక ప్రేమకు ఛాన్స్ లేదు అంటూ తేల్చి పడేసింది . కాగా సమంత లైఫ్ లో నాగచైతన్య కంటే అంత స్థానం దక్కించుకున్న పర్సన్ సమంత తండ్రి. ఆయన మరణించడంతో సమంతను కంట్రోల్ చేయడం ఎవరి తరం కావడం లేదట . అంతే కాదు సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ వద్ద కన్నీరు మున్నీరు గా విలపిస్తుందట . అయితే ఇదే మూమెంట్లో సమంతను విడాకుల తర్వాత చాలా దూరం పెట్టేసిన తెలుగు హీరోస్ మళ్లీ ఆమెకు కాల్ చేసి తండ్రి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతూ వస్తున్నారట .
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం సమంతకి స్పెషల్గా కాల్ చేసి మరి ఈ బాధాకర సమయంలో ఆమెకు తోడుగా నిలబడే విధంగా మాట్లాడారట . అంతేకాదు ఇప్పటికే అఖిల్ కూడా ఆమెకు కాల్ చేసి మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అలాగే బాలీవుడ్ హీరోస్ కూడా ఆమెకు సపోర్టుగా నిలిచారట . అంతేకాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా ఫ్రెండ్ గా మారిన చిన్మయి అదే విధంగా రాహుల్ కూడా సమంత తండ్రి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆమె ఈ బాధాకర సిచువేషన్ నుంచి త్వరగా బయటికి రావాలి అంటూ కోరుకుంటున్నారట . ఇదే మూమెంట్లో ఎన్టీఆర్ - సమంతకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాగా ట్రెండ్ అవుతుంది . ఎన్టీఆర్ - సమంత చాలా చాలా మంచి ఫ్రెండ్స్ . అయితే విడాకుల తర్వాత ఎన్టీఆర్ - సమంత ఎక్కడ కలిసింది లేదు . ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ - సమంతతో మాట్లాడడంతో వీళ్ళ కాంబోలో సినిమాలు రావచ్చు అంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు..!