నాగచైతన్యకు హిట్ ఇచ్చిన సినిమాలలో ప్రేమమ్ మూవీ కూడా ఉంటుంది. మలయాళ ప్రేమమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సనిమా తెలుగులో కూడా ప్రేమమ్ గానే విడుదలైంది. ఇక నాగచైతన్య హీరోగా చేసిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్,శృతిహాసన్, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్ లుగా నటించారు.. ఈ సినిమాలో నాగచైతన్య మేనమామ వెంకీ చేసిన గెస్ట్ రోల్ ఏ విధంగా ప్లస్ అయిందో ఇప్పుడు చూద్దాం..
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగావంశీ నిర్మాతగా చేసిన ప్రేమమ్ సినిమా 2016 అక్టోబర్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య నడిపిన లవ్ స్టోరీస్ చూపించారు. స్కూల్ డేస్ లో అనుపమ పరమేశ్వరన్ తో కాలేజ్ చదువుతున్న రోజుల్లో గెస్ట్ లెక్చరర్ శృతిహాసన్ ప్రేమలో పడతాడు. చివరికి మడొన్నా సెబాస్టియన్ పరిచయం అవుతుంది. అలా సాగిన కథనంలో ఎపిక్ పవర్ఫుల్ గెస్ట్ రోల్ లో వెంకటేష్ కనిపించారు. ఈ సినిమాలో నాగచైతన్య తాగి కాలేజీకి వచ్చి గొడవ చేస్తాడు. దాంతో మీ పేరెంట్స్ ని తీసుకురమ్మని ప్రిన్సిపాల్ చెప్పడంతో పేరెంట్స్ రాకుండా సడన్ గా ఎంట్రీ ఇస్తారు వెంకటేష్. ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి నేను డీసీపీ రామచంద్ర విక్కీ( అంటే నాగచైతన్య) మేనమామ ని అంటూ పరిచయం చేసుకుంటాడు.
ఇక ఆ టైంలో వెంకటేష్ ఎంట్రీ ఇచ్చే సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆయన వాకింగ్ స్టైల్ చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రిన్సిపాల్ నాగచైతన్య గురించి వెంకటేష్ కి కంప్లైంట్ చేస్తాడు.ఆ సమయంలో క్లాస్ కి తాగొచ్చాడు అని ప్రిన్సిపాల్ చెప్పగా.. ఏరా తాగాలంటే బార్ లో తాగు.లేదా ఇంట్లో తాగు. కాలేజీలో ఎందుకు తాగుతున్నావ్ రా.. అంటూ జలక్ ఇవ్వడంతో ప్రిన్సిపాల్ షాక్ అవుతాడు. అంతేకాదు నా మేనల్లుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది వాడు భవిష్యత్ లో మంచి పొజిషన్లో ఉంటాడు. అంటూ వెంకటేష్ మాట్లాడడం ప్రిన్సిపాల్ కి షాకింగ్ గా అనిపిస్తుంది. అలా ప్రేమమ్ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేయడం సినిమాకి పెద్ద ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.