తెలుగు ,
తమిళ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో
త్రిష ఒకరు. ఇకపోతే
త్రిష టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సీనియర్ ,
జూనియర్ స్టార్ హీరోలతో నటించి ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో కెరీర్ను కొనసాగించింది. ప్రస్తుతం
త్రిష ,
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ
మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు కంటే
తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ వస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా
త్రిష తన తల్లి ఉమా కృష్ణన్ తో కలిసి ఓ
తమిళ అవార్డు వేడుకకు వెళ్ళింది. ఇక ఈ అవార్డు వేడుకలో భాగంగా యాంకర్
త్రిష తల్లిని
త్రిష కెరియర్ లో చాలా కష్టపడిన
సినిమా ఏది అని ప్రశ్నించింది. దానికి
త్రిష తల్లి ఉమా కృష్ణన్ స్పందిస్తూ ...
త్రిష తన కెరియర్లో వర్షం
సినిమా కోసం ఎంతగానో కష్టపడింది. ఆ
సినిమా కోసం ఏకంగా 45 రోజులు వర్షంలోనే గడిపాం. ఇదంతా ఎందుకు
సినిమా మానేసి
చెన్నై కి వెళ్ళిపోదాం అని కూడా అనుకున్నాం. కానీ ధైర్యంతో అలాగే ముందుకు వెళ్లాం. ఇక ఆ
సినిమా విడుదల తర్వాత మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం అని
త్రిష తల్లి ఉమా కృష్ణన్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ విషయంపై
త్రిష స్పందిస్తూ ... వర్షం
మూవీ కోసం నేను చాలా కష్టపడ్డాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే వర్షం సినిమాలో
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా ...
త్రిష ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది. శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించాడు. దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఈ
మూవీ అదిరిపోయే రేంజ్
బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.