రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్.. సినిమాకి టైటిల్ కి పోలికే లేదుగా..!!

Pandrala Sravanthi
రామ్ చరణ్ సినీ కెరియర్లో వచ్చిన సినిమాలన్నింటిలో ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు.కానీ ఈ సినిమా చూసిన కొంత మంది అయితే కల్ట్ క్లాసిక్ అంటారు. ఇక ఇప్పటికే ఆ సినిమా ఏంటో మీకు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.అదేనండి ఆరెంజ్ మూవీ.. రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా..సెకండ్ హీరోయిన్ గా షాజన్ పద్మసి లు నటించారు. ఈ మూవీకి భాస్కర్ దర్శకత్వం వహించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా చేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా రీ రిలీజ్ లో మాత్రం సంచలనం సృష్టించింది. దాంతో ఇది ఫ్యూచర్ ఫిల్మ్ అని చాలామందికి అర్థం అయిపోయింది. మరి ఆరెంజ్ మూవీ ఫ్లాప్ వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
 ఓ సినిమా సక్సెస్ ని రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు.ఒకటి కలెక్షన్లు సంపాదించి డబ్బులు ఎక్కువగా రాబట్టిన సినిమా..మరొకటి హిట్ అవ్వక పోయినప్పటికీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండి పోయే క్లాసిక్ సినిమా.ఇక ఆరెంజ్ మూవీ రెండో రకానికి చెందినది.ఈ సినిమా కలెక్షన్లు అందుకోకపోయినప్పటికీ సినిమా మాత్రం కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది.ఆరెంజ్ మూవీ విడుదలైన సమయం లో ఎందుకు ఫ్లాఫ్ అయిందో తెలియదు. కానీ ఈ సినిమాలోని బిజిఎం, పాటలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.ఈ పాటలు ఎప్పటికీ ఎవర్గ్రీన్. ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్ ఏదో ఒక రకంగా కలిసే చివరికి ఒకటవ్వతారు. కానీ ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ అనడం కంటే అబౌట్ స్టోరీ ఆఫ్ లవ్ అని అనుకోవచ్చు.ఈ సినిమాలోని స్టోరీ అంతా రామ్ క్యారెక్టర్ అలాగే ఆయన ఐడియాల గురించే ఉంటుంది.

ఏవిషయమైనా సరే కుండబద్దలు కొట్టేలా చెప్పడం హీరో రామ్ వంతు. నచ్చినట్టు బతకాలనే క్యారెక్టర్ తో రామ్ చరణ్ ఉంటారు. ఈ సినిమాలో రాంచరణ్ ఎక్కువకాలం ఒకరినే ప్రేమించలేం అనే విషయాన్ని ఎక్కువగా చెబుతూ ఉంటారు. కానీ ఈయన్నీ ప్రేమించిన హీరోయిన్లు మాత్రం జీవితాంతం ప్రేమ కావాలి అంటారు. దాంతో ఇది నచ్చని రామ్ చరణ్ వారికి దూరమవుతారు. పెళ్లయ్యాక ప్రేమ కాకుండా రెస్పాన్సిబులిటీ ఉంటుంది అని ఈ సినిమాలో చూపించారు. అయితే అప్పటి జనరేషన్లో ఈ సినిమా అప్పటివరకు వచ్చిన లవ్ స్టోరీస్ అన్నింటిలో చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక కొత్త రకమైన లవ్ స్టోరీని ప్రేక్షకులకు పరిచయం చేశారు డైరెక్టర్. కానీ ఈ సినిమాలో కొన్నిచోట్ల చిన్నచిన్న లోపాలు కూడా ఉన్నాయి.

ఈ సినిమాలో కథని ఎక్కువగా హీరో సెంట్రిక్ చేయడం, అనస్పెక్టెడ్ గా వచ్చే పాత్రలు,  పాటలను స్టోరీ టెల్లింగ్ కి వాడుకోలేకపోవడం సినిమా చూసే ఆడియన్స్ కి లవ్ గురించి ఒక్క పాయింట్లు లనే చెప్పాలనుకోవడం. ఈ కారణాల వల్ల ఫస్ట్ టైం ఆరెంజ్ చూసిన వాళ్ళందరికీ బోర్ అనిపించింది. కానీ వెరైటీ ఆఫ్ లవ్ స్టోరీ మూవీస్ లో ఆరెంజ్ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.అందుకే దీన్ని కల్ట్ క్లాసిక్ మూవీ గా అందరూ పిలుచుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి మరో మైనస్ ఏంటంటే.. సినిమా టైటిల్ .. కథకి సినిమా టైటిల్ కి ఏ మాత్రం పోలిక లేకుండా ఆరెంజ్ అని టైటిల్ పెట్టడం కూడా ఒక మైనస్ అయిందని చెప్పుకోవచ్చు.అలా ఈ సినిమా అప్పట్లో పెద్ద ఫ్లాప్ అయింది.ఈ సినిమా నిర్మించిన నాగబాబు కూడా అప్పుల్లో కూరుకుపోయారు. కానీ రీ రిలీజ్ లో ఈ సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: