మెగాస్టార్ చిరంజీవి , దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కాంబోలో ఎన్నో సినిమాల వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచాయి. వీరి కాంబోలో ఓ మూవీ ఆల్మోస్ట్ సెట్ అయ్యి చివరి నిమిషంలో క్యాన్సల్ అయిందట. ఆ సినిమా ఏది .? ఎందుకు క్యాన్సల్ అయింది .? అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు హీరోగా శోభన హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడు గారు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఇకపోతే ఈ సినిమాను రాఘవేంద్రరావు మొదటి చిరంజీవితో చేయాలి అనుకున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం కథను చిరంజీవికి రాఘవేంద్రరావు ఒకసారి వినిపించాడట. స్టోరీ బాగుంది ఎవరితో చేద్దాం అనుకుంటున్నాను స్టోరీ మొత్తం అయ్యాక మరోసారి కథ వినిపిస్తాను అన్నాడంట. ఓకే సార్ అని చిరు అన్నాడట.
ఆ తర్వాత కొంత కాలానికి రాఘవేంద్రరావు , చిరంజీవికి ఫోన్ చేసి నీకు కొన్ని రోజుల క్రితం ఓ స్టోరీ చెప్పాను కదా అది మొత్తం పూర్తి అయ్యింది అన్నాడట. దానితో ఓకే సార్ ... ఎప్పటి నుండి స్టార్ట్ చేద్దాం అని చిరు అన్నాడట. దానితో సినిమా నీతో కాకుండా వేరేది వారితో చేద్దాం అనుకుంటున్నాను అన్నాడట. ఎందుకు సార్ అని చిరు అనగా ... ఆ సినిమా క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోవాల్సి ఉంటుంది. నీ ఈమేజ్ కి హీరో పాత్ర చనిపోతే ప్రేక్షకులు ఒప్పుకోరు. సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వేరే హీరోతో చేద్దాం అనుకుంటున్నాను అన్నాడట. దానితో ఓకే సార్ అని చిరంజీవి అన్నాడట. అలా చిరు , రాఘవేంద్రరావు కాంబోలో అల్లుడు గారు సినిమా మిస్ అయినట్లు తెలుస్తోంది.