తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే ఈయన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ మొదటగా మున్నా అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా తర్వాత దిల్ రాజు , ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీ ని రూపొందించాడు.
ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. దిల్ రాజు "మిస్టర్ పర్ఫెక్ట్" మూవీ గురించి మాట్లాడుతూ ... మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ దర్శకుడు అయినటువంటి దశరథ్ నాకు ఒక సారి మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాకు సంబంధించిన కథను వివరించాడు. అది నాకు బాగా నచ్చింది. దానితో అది ప్రభాస్ కి బాగుంటుంది అనిపించింది. ఇక ఆయన ఆ సమయంలో ఆయన ఫరన్ లో ఉండడంతో నేను ఫోన్లోనే దశరద్ తో కథను ప్రభాస్ కి చెప్పించాను. ఆయన మొదటి భాగం బాగుంది , కానీ రెండవ భాగం నచ్చలేదు అన్నాడు. దానితో నేను కొంత కాలం టైం తీసుకుని రెండవ భాగాన్ని బెటర్ గా చేయించాను. కొన్ని రోజులకి ప్రభాస్ కి రెండవ భాగం రెడీ అయ్యింది వినమని ఫోన్ చేసి చెప్పాను ఇక ఆయన ఈ సినిమా చేయకూడదు అని చెప్పాలి అనుకున్నాడట.
కానీ కథ విని చెబుదాం అనుకొని వచ్చి కథను విన్నాడు. ఇక కథ విన్న తర్వాత ఆయనకు సెకండాఫ్ అద్భుతంగా నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్ , నాతో నేను సినిమా చేయొద్దు అనుకున్నాను. కానీ మీరు సెకండ్ హాఫ్ ను చాలా బాగా డెవలప్ చేశారు. అందుకే సినిమా చేస్తున్నాను అని అన్నట్లు చెప్పుకొచ్చాడు.