ప్రముఖ
కోలీవుడ్ స్టార్
హీరో సూర్య గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .. ఎప్పటి కప్పుడు వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకొని విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాడు.
సూర్య కంగువ అనే పిరియాడికల్ డ్రామా
మూవీ దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ
సినిమా అనంతరం
సూర్య అదే రేంజ్ లో మరో
సినిమా చేయబోతున్నాడని సమాచారం.
బాలీవుడ్ డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్షన్‌లో
సూర్య ఒక
సినిమా ‘కర్ణ’ అనే ఒక బడా ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నట్ల సమాచారం. ఇక ఈ విషయం గురించి ఈ దర్శకుడిని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “నేను ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాను అని తెలిపారు. వాటిలో కర్ణ కూడా ఒకటి” అంటూ సమాధానం ఇచ్చారు. ఈ మాటలతో దర్శకుడు రాకేశ్ ఓం సూర్యతో ప్రాజెక్ట్ ని ఇన్‌డైరెక్ట్ గానే కన్‌ఫార్మ్ చేసేశాడు అని పూర్తిగా అర్థం అవుతుంది
వాస్తవానికి ఈ సినిమాని దాదాపు 600 కోట్లతో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్యతో పాటు టాలీవుడ్,
కోలీవుడ్, శాండల్‌వుడ్,
బాలీవుడ్ లోని బిగ్ స్టార్స్ కూడా నటిచబోతున్నట్టు సమాచారం.కానీ
సూర్య ఇలా వరుసపెట్టి పిరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమాలతో పాన్
ఇండియా మార్కెట్ లో సందడి చేయడానికి వస్తుండడంతో అభిమానులు ఫుల్
జోష్ లో ఉన్నారు అనే చెప్పాలి.. కానీ ఒక బ్యాడ్ న్యూస్.. బడ్జెట్ సమస్యల వల్ల నిలిచిపోయిందని, కొత్త నిర్మాతం వేటలో
డైరెక్టర్ ఉన్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మరో వైపు మహాభారతం ఆధారంగా రూపొందాల్సిన ఈ సినిమాలో ద్రౌపదిగా జాన్వీ కపూర్ నటిస్తునట్టు సమాచారం.. చూడాలి మరి చివరికి ఈ ‘కర్ణ’
సినిమా పయనం ఎటు పోతుందో..