తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహేష్ బాబుకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాల నటుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు అతి చిన్న వయసులోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు నటించిన "నిజం" సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా రక్షిత నటించింది. గోపీచంద్ విలన్ పాత్రను పోషించారు. ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.
ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నిజం సినిమాలో మహేష్ బాబు చాలా అద్భుతంగా నటించాడు. ఈ సినిమా 2003 మే 24న విడుదలైంది. ఈ సినిమాను కొనడానికి చాలామంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ సినిమాకి రూ. 7 కోట్ల మేరకు ఖర్చు అయితే దాదాపు రూ. 21 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కానీ ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నిస్సాహాయుడుగా కనిపించడం వల్ల ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిందని చెప్పవచ్చు.
అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు తన తల్లి సహాయం లేకుండా ఎటువంటి పని చేయలేడు అన్నట్టుగా మహేష్ బాబు ఉండడం చేత ప్రేక్షకులను నిరుత్సాహపరిచాడు. ఇందులో గోపీచంద్ ని విలన్ పాత్రలో అద్భుతంగా చూపించారు. కానీ హీరోని మాత్రం చూపించడంలో ఫెయిల్ అయ్యారు. ఈ విషయాలను స్వయంగా డైరెక్టర్ తేజ ఒకానొక సందర్భంలో వివరించాడు. ఈ సినిమాకి గాను మహేష్ బాబుకి ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. సపోర్టింగ్ రోల్ గా తాళ్లూరి రామేశ్వరి గారికి పురస్కారం లభించింది.
ఈ సినిమా ఒడియాలో అర్జునగా, బంగ్లాదేశ్ లో టాప్ లీడర్ గా రీమేక్ చేయబడింది. మహేష్ బాబుకి ఈ సినిమా మైనస్ అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని అనంతరం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ బాబు త్వరలోనే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంతో "SSMB 28'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.