ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోయే హీరోయిన్ ఈమె.. ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చెప్పకుండా భలే షాక్ ఇస్తున్నారు . ఒకరు కాదు ఇద్దరు కాదు. బోలెడు మంది హీరోయిన్స్ చెప్పకుండా నిశ్చితార్థం చేసుకొని బ్యాక్ టు బ్యాక్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోతున్నారు . మొన్నటికి మొన్న హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకొని అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చాడు. నిశ్చితార్ధం అయిపోయిన తర్వాత ఫొటోస్ బయటకు రిలీజ్ చేసి త్వరలోనే మేము ఒకటి కాబోతున్నామంటూ నిశ్చితార్థం విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశాడు.  త్వరలోనే నాగచైతన్య శోభిత ధూళిపాళ్లు భార్యాభర్తలుగా మన ముందుకు రాబోతున్నారు . డిసెంబర్ 4వ తేదీ 8:13 నిమిషాలకు వీళ్ళ పెళ్లి జరగబోతుంది.


అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వీళ్ల పెళ్లి జరగబోతూ ఉండడం గమనార్హం. రీసెంట్గా నాగర్జున సైతం ఆ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు.  అయితే ఇండస్ట్రీలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా డిసెంబర్ లోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.  కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబర్ 12వ తేదీ గోవాలో వీళ్ల పెళ్ళి చాలా గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలుస్తుంది.  అయితే డిసెంబర్ లోనే హీరోయిన్ తమన్నా కూడా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తో నిశ్చితార్ధం చేసుకోబోతున్నట్లు బాగా వార్తలు వినిపిస్తున్నాయి .  ఇన్సైడ్ వర్గాల నుంచి ఈ మ్యాటర్ లీక్ అవుతుంది.


అంతేకాదు ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోయే హీరోయిన్ పూజా హెగ్డే అంటూఉ ప్రచారం జరుగుతుంది . పూజా హెగ్డే తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం చేసుకోవడానికి రెడీగా ఉందట.  కానీ కెరియర్ లో అప్ అండ్ డౌన్స్ వస్తున్న కారణంగా హోల్డ్ లో పెట్టిందట . బడాబడా స్టార్స్ అందరూ కూడా వెంట వెంటనే లైఫ్లో అయిపోతూ ఉండడంతో పూజా హెగ్డే పేరెంట్స్ నుంచి ప్రెజర్ పెరిగిపోతుందట . ఈ క్రమంలోనే పూజా హెగ్డే పెళ్లి ని కూడా త్వరగా చేసేయాలి అనుకుంటున్నారట . అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది స్టార్టింగ్ లోనే పూజా హెగ్డే కూడా పెళ్లి పీటలు ఎక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు జనాలు . ఇలా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు అందరూ పెళ్లిల్య్ చేసుకోవడం పెళ్లికి రెడీ అవుతూ ఉండడం అభిమానులకి కూడా ఫుల్ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: