కీర్తి సురేష్ పెళ్లి ఈ స్టార్ హీరో మెడకు చుట్టుకుందే...ఇలా ఇరుక్కుపోయాడు ఏంటి..!
కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ల పెళ్లి గ్రాండ్గా జరగబోతుందట . ఇప్పటికే ఆ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసాడు కీర్తి సురేష్ తండ్రి. అయితే హీరోయిన్ నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్లోనే జరుగుతూ ఉండడం హైలైట్ అయిన విషయం. మరొక పక్క పూజా హెగ్డే కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని ప్రచారం జరుగుతుంది . అంతేకాదు తమన్నా కూడా తన బాయ్ ఫ్రెండ్ ని నిశ్చితార్ధం చేసుకోబోతుంది అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి .
ఎన్ని వార్తలు వినిపించిన ఇప్పుడు అందరి ఫోకస్ ఒక హీరో పైనే ఉంది. ఆయనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ఆరడుగుల అందగాడు ప్రభాస్ . ప్రభాస్ ఈ సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కాల్సింది . వాళ్ళ పెద్దమ్మ కూడా అదే విషయాన్ని కన్ఫామ్ చేసింది . రీజన్ ఏంటో తెలియదు కానీ పెళ్లి ప్రస్తావనే లేదు . అసలు పెళ్లి అన్న పదం ప్రభాస్ నోటి నుండి వచ్చిందే లేదు . అందరూ నవంబర్లో ఈయన పెళ్లి జరుగుతుంది అంటూ ఆశపడ్డారు . ఆ మూమెంట్ దాటిపోతుంది . ఇక మిగిలింది డిసెంబర్ మాత్రమే. ఈలోపే ఆయన పెళ్లి విషయం బయట పెడితే బాగుండు అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
కానీ ప్రభాస్ వాలకం చూస్తుంటే పెళ్లి విషయం నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పనిచేస్కున్నట్లే తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్ళి వార్త విన్న ప్రతి ఒక్కరూ ప్రభాస్ పెళ్లి వార్త గురించి వినడానికి ఇష్టపడుతున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్ పెళ్లిని ట్రోల్ చేస్తున్నారు. నీకు పెళ్లి ధ్యాస లేదా ..? పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదా..? అసలు నువ్వు పెళ్లి చేసుకుంటావా..? చేసుకోవా..? అంటూ సొంత ఫ్యాన్స్ కూడా కోప్పడుతున్నారు. ఇకనైనా ప్రభాస్ పెళ్లి విషయంపై నోరు విప్పితే బాగుంటుంది అన్నది కోట్లాదిమంది జనాల అభిప్రాయం . చూద్దాం మరి ప్రభాస్ పెళ్లి విషయంలో ఎప్పుడు నోరు విప్పుతాడో..??