"నా కొడుకు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు".. నాగచైతన్య పెళ్లి పై నాగార్జున సంచలన కామెంట్స్..!

Thota Jaya Madhuri
నాగార్జున కి ఎప్పుడు .. ఎలా.. ఎంత మాట్లాడాలో బాగా తెలుసు. అందుకే ఈ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు అంటూ జనాలు  ఆయన గురించి  మాట్లాడుతుంటారు . కాగా రీసెంట్ గా ఆయన కొడుకు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.  త్వరలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ మెడలో మూడు ముళ్ళు వేసి అక్కినేని ఇంటికి పెద్ద కోడలిగా తీసుకురాబోతున్నాడు  అక్కినేని నాగచైతన్య . ఈ క్రమంలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మ్యారేజ్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో బాగా టర్న్ అవుతున్నాయి . అయితే నాగార్జున మాత్రం ఎప్పుడూ కూడా దీనిపై నోరు విప్పిందే లేరు .


ఫర్ ద ఫస్ట్ టైం ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో నాగచైతన్య పెళ్లి పై స్పందించారు . నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్ధం  ఫోటోలు షేర్ చేసిన తర్వాత నాగార్జున ఎక్కడ కూడా వీళ్ళ పెళ్లికి సంబంధించి అసలు మాట్లాడలేదు . రీసెంట్గా ఐఫా అవార్డ్స్ జరిగాయి . అక్కడకు వెళ్లిన నాగార్జున ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఆ ఇంటర్వ్యూలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి విషయాలు బయట పెట్టారు .


"అన్నపూర్ణ స్టూడియోస్ లోనే పెళ్లి జరగబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు". అంతేకాదు "అసలు వీళ్ళు నాకు పెళ్లి పనులు అప్పగించలేదని.. మొత్తం పెళ్లి పనులు మేమే చూసుకుంటామని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ ఇద్దరు  పెళ్లి బాధ్యతలను తీసుకున్నారు" అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు . అంతేకాదు నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ళ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాం "అంటూ కూడా చెప్పుకువచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు మొదటి నుంచి నాగ చైతన్య అంటే ఇష్టం గల  నాగార్జున ..ఆయన లైఫ్ లో సెటిల్ అయితే చూడాలి అంటూ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే నాగచైతన్య లైఫ్ లో సెటిల్ కాబోతూ ఉండడంతో నాగార్జున ఫుల్ ఖుషి గా కూడా ఉన్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: