రివ్యుయర్స్ పై ఉక్కు పాదం.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ప్రేక్షకులు బండ్లు కట్టుకొని వచ్చి మరి సినిమా  చూసేవారు. అప్పట్లో ఎలాంటి రివ్యూయర్లు లేరు.. ప్రేక్షకులు చెప్పిందే అసలైన రివ్యూ.. ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ప్రేక్షకులకు నచ్చలేదంటే మాత్రం ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచేది. అప్పట్లో సినిమాలు 100 రోజులు, 200 రోజులు ఆడేవి. ప్రస్తుతం సినిమా తీరు మారింది. కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో థియేటర్లోకి వచ్చిన సినిమా పట్టుమని నాలుగు వారాలు కూడా ఆడకముందే ఓటిటి లోకి ప్రత్యక్షమవుతుంది. ఆ నాలుగు వారాలు అయినా కానీ ప్రేక్షకులతో కలకలలాడుతుందా అంటే అది లేదు. స్టార్ హీరోలు సినిమాలు సంవత్సరానికి రెండు లేదా సంవత్సరానికి మూడుచొప్పున రిలీజ్ అవుతూ ఉంటాయి. స్టార్ హీరో సినిమాలు వస్తేనే థియేటర్లు ఫుల్లుగా కలకలాడుతూ ఉంటాయి. అయితే రివ్యూల మూలంగా సినిమాకి వచ్చే కలెక్షన్లు తగ్గుతున్నాయి..

సినిమా గురించి ఎలాంటి అవగాహన లేని రివ్యూయర్లు సినిమా బాగోలేదని ప్రచారం చేయడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేస్తున్నారు. కొందరు జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నారు కానీ చాలామంది నెగటివ్ రివ్యూస్ ఎక్కువ ఇవ్వడం వల్ల సినిమాకు వచ్చే కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది.. ఇటీవల రిలీజ్ అయిన స్టార్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా కథ బాగున్నా కూడా నెగటివ్ రివ్యూస్ మూలంగా ప్రేక్షకులు థియేటర్స్ వెళ్లడం మానేశారు.కంగువా మూవీ ఎఫెక్ట్‌తో తమిళనాడు నిర్మాతల సంఘం, థియేటర్ల దగ్గరికి రివ్యూ రైటర్లు మరియు యూట్యూబ్ రివ్యూయర్లు రాకుండా బ్యాన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే నిర్ణయం అమలు చేయబోతున్నట్టు నిర్మాత, డిస్టిబ్యూటర్ 'దిల్' రాజు ప్రకటించారు..తమిళనాడులో యూట్యూబ్ రివ్యూలు చేసేవారికి మొదటి రోజు థియేటర్‌ దగ్గరికి రానివ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇది అక్కడ సక్సెస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా ఇదే అమలు చేస్తాము.. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌ మరియు ఎగ్జిబిటర్స్‌తో చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే ఈ విషయంపై మా నిర్ణయం ప్రకటిస్తాం..అంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: