టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈయన మెకానిక్ రాఖీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా నవంబర్ 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో మీరాక్షి చౌదరి , శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఇప్పటికే విశ్వక్ సేన్ "లీలా" అనే ఓ మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇంత కాలం పాటు మెకానిక్ రాఖీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విశ్వక్ ఇకపై లీలా సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
విశ్వక్ మరో ఇద్దరూ డైరెక్టర్లతో సినిమాలను కమిట్ అయినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అనుదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వక్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుదీప్ , విశ్వక్ కి ఓ స్టోరీ వినిపించగా అది బాగా నచ్చడంతో అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేయడానికి విశ్వక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొంత కాలం లోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ దర్శకుడితో పాటు పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమా దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో కూడా విశ్వక్ ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సాగర్ కూడా ఇప్పటికే విశ్వక్ కి ఓ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో విశ్వక్ ఈ దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా విశ్వక్ అదిరిపోయే రేంజ్ లో సినిమాలను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది.