తమన్నా: ఇద్దరినీ ప్రేమించి వదిలేసానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మిల్కీ బ్యూటీ.!

FARMANULLA SHAIK
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలు ఈ మధ్య బాగా తగ్గించేసింది. ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్ గా రాణించిన తమన్నా. దాదాపు అందరూ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. యంగ్ హీరోల దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతోనూ కలిసి నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తమన్నా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్లిక్ అయ్యింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు పెరిగాయి. తమిళ్ హీరో కార్తీ నటించిన ఆవారా సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆతర్వాత వరుసగా తమిళ్, తెలుగు భాషల్లో సినిమాలు చేసిమెప్పించింది ఈ అందాల భామ.ఇదిలావుండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన జీవితంలో రెండు లవ్ ఫెయిల్యూర్లు ఉన్నాయని తమన్నా తెలిపింది. టీనేజ్ లో ఉన్నప్పుడు తాను ప్రేమలో పడ్డానని అయితే ఆ లవ్ ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పింది. 

ఆ సమయంలో తాను ఏదో సాధించాలనే తపనతో ఉన్నానని ఒక వ్యక్తి కోసం తన జీవితాన్ని వదులుకోవాలనిపించలేదని తెలిపింది. ఆ విధంగా తాను తొలి హార్ట్ బ్రేక్ ను ఎదుర్కొన్నానని చెప్పింది. ఆ తర్వాత తాను మరొక వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఆ ప్రేమ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదని తమన్నా తెలిపింది. ప్రతి విషయానికి అతను అబద్ధం చెప్పేవాడని దీంతో, ఆ వ్యక్తితో బంధాన్ని తాను కంటిన్యూ చేయలేకపోయానని చెప్పింది. ఆ విధంగా తాను రెండో హార్ట్ బ్రేక్ ను ఎదుర్కొన్నానని తెలిపింది.ప్రస్తుతం తమన్నా హిందీ సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టింది. తెలుగులో చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించింది తమన్నా.. ఇదిలా ఉంటే తమన్నా హిందీలో పలు వెబ్ సిరీస్ లు చేసింది. అలాగే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోనుంది. విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: