మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అనతి కాలంలోనే తన అద్భుతమైన నటనతో తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.ఎన్టీఆర్ యాక్టింగ్ కి ,అలాగే డాన్స్ కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు అంటూ ఉండదు.తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.ముందుగా ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఎన్టీఆర్ కి వున్న భారీ క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగడానికి ఎంతగానో కష్టపడ్డారు.తన చిన్నతనం నుంచి ఎంతో అల్లరిగా పెరిగిన ఎన్టీఆర్ ని ఆయన తల్లి షాలిని ఎంతో క్రమశిక్షణతో పెంచింది.తనకి జీవితంపై సరైన దృక్పధం ఏర్పడేలా చేసింది తన తల్లే అని ఎన్టీఆర్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు.పెద్దల అతి గారాబం వల్ల ఎన్టీఆర్ కెరీర్ గాడి తప్పుతుందేమో అని భయపడిన ఆయన తల్లి షాలిని ఎన్టీఆర్ ని చాలా క్రమశిక్షణతో పెంచింది.
ఎన్టీఆర్ హైదరాబాద్ లోని విద్యారణ్య హై స్కూల్ లో ప్రాధమికోన్నత విద్య పూర్తి చేసారు.ఇంటర్మీడియట్ లో చేరే సమయానికి హైదరాబాద్ లో అతని అల్లరి భరించడం కష్టమని హరికృష్ణ ,షాలిని దంపతులు బాగా ఆలోచించి గుంటూరు విజ్ఞాన్ కాలేజీ హాస్టల్ లో చేర్పించారు.కానీ ఎన్టీఆర్ మనసంతా హైదరాబాద్ చుట్టూనే తిరుగుతూ ఉండేది.అక్కడి స్నేహితులని విడిచి కఠిన నియమాలు వున్న వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీలో ఉండటం ఎన్టీఆర్ కి ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు.
ఒకసారి అక్కడి నుంచి తప్పించుకోడానికి కాలు విరగొట్టుకున్నాడట ఎన్టీఆర్.అలాగైనా తనని హైదరాబాద్ తీసుకెళ్తారేమో అని భావించారు.కానీ హరికృష్ణ మరింత కఠినంగా ఉండటంతో ఎన్టీఆర్ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు.ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అక్కడే చదువు కొనసాగించిన ఎన్టీఆర్ ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీ కాలేజీ లో ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసాడు.ఆ తరువాత చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి నటనపై ఆసక్తి కనబరిచాడు.చిన్నతనం నుంచి నటనపై మక్కువ పెంచుకున్న ఎన్టీఆర్ హీరోగా రాణించాలని ఎంతగానో ప్రయత్నించాడు.దాని కోసం చిన్నతనంలో కూచిపూడి నాట్యం నేర్చుకుని అందులో అత్యున్నత ప్రతిభ కనబరిచారు.