టాలీవుడ్ లోనే మోస్ట్ ఎడ్యుకేటెడ్ హీరో.. కుటుంబంలో చరిత్ర సృష్టించాడు..?

praveen
* తెలుగు సినిమాల్లోనూ ఉన్నత చదువులు చదివిన వారెందరో ఉన్నారు
* వారిలో కళ్యాణ్ రామ్ ఒకడు  
* ఈ హీరో తన కుటుంబాల్లోనే ఎక్కువ చదువు చదివి చరిత్ర సృష్టించాడు  
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
దివంగత నటుడు నందమూరి హరికృష్ణ తనయుడు  నందమూరి కళ్యాణ్ రామ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నందమూరి అందగాడు తెలుగు చిత్రసీమలో మంచి నటుడు, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. లెజెండరీ నటుడు, రాజకీయ నాయకుడు N. T. రామారావుకు మనవడు అవుతాడు. కళ్యాణ్ రామ్ అతనొక్కడే, హరే రామ్, 118 వంటి యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. పటాస్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతను తన తాత పేరు మీద ఉన్న N.T.R. ఆర్ట్స్ చిత్ర నిర్మాణ సంస్థను ఈ హీరోని ఆపరేట్ చేయడం విశేషం. ఈ నందమూరి హీరోకి  అద్విత క్రియేటివ్ పేరిట ఓ సొంత స్టూడియోస్‌ కూడా ఉంది. ఇది వీడియో ఎఫెక్ట్స్‌ క్రియేట్ చేస్తుంది. ఈ స్టూడియోనే లెజెండ్, నాన్నకు ప్రేమతో, కృష్ణాష్టమి వంటి ప్రముఖ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించింది.
కళ్యాణ్ రామ్ హైదరాబాద్‌లో హరికృష్ణ, అతని మొదటి భార్య లక్ష్మీ కుమారి దంపతులకు జన్మించాడు. ఇతనికి  ప్రముఖ నటుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్టెప్ బ్రదర్ అవుతాడు. ఇక కళ్యాణ్ రామ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ యాక్టర్స్ లో ఒకటిగా నిలుస్తున్నాడు. కళ్యాణ్ హైదరాబాద్‌లోని సెయింట్ పాల్స్ హైస్కూల్, విజయవాడలోని KCP సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివాడు.
కోయంబత్తూరులో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు.  ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లో హీరోగా నటించాలని ప్రయత్నించాడు కానీ తన తండ్రి మాత్రం ముందు చదువు పూర్తి చేయాలని పట్టుబట్టాడు. దాంతో తండ్రి కోరిక మేరకు అతను తన హీరో కలను కొద్ది రోజులు వాయిదా వేసుకున్నాడు. తర్వాత కళ్యాణ్ రామ్ చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక్కడ బాగా చదివి మాస్టర్స్ పూర్తి చేశాడు. అలా అతను తన కుటుంబంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సాధించిన మొదటి వ్యక్తి అయ్యాడు. 2006, ఆగస్ట్ 9న కళ్యాణ్ రామ్ స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు త్వరలోనే సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: