మహేష్ , నాగచైతన్య .. ఆ స్టార్ హీరోయిన్ ని నమ్మించి గొంతుకోసారుగా..!
అలాగే పూజా హీరోయిన్ గానే ఈ సినిమాను మొదలు పెట్టారు . కానీ మధ్యలో అనుకోని కారణాలతో ఆమెను తొలగించి శ్రీలీలను పెట్టుకున్నారు. ప్రభాస్ తో చేసిన రాధేశ్యామ్ సినిమా నుంచి పూజ హెగ్డే కు తెలుగులో ఊహించని కష్టాలు మొదలయ్యాయి. వరుస డిజాస్టర్లు పడటంతో టాలీవుడ్లో ఆమెకి సినిమా అవకాశాలు కరువయ్యాయి. గుంటూరు కారం సినిమా నుంచి ఆమెను తీసేసిన తర్వాత టాలీవుడ్ లో ఇంకే సినిమాలో కూడా ఆమెకు అవకాశం రాలేదు. తెలుగులో ఎంట్రీ ఇచ్చింది నాగచైతన్య ఒక లైలా కోసం సినిమా తోనే.
ఇప్పుడు ఆమె రీఎంట్రీ కూడా నాగచైతన్య సినిమాతోనే అంటూ ప్రచారం బయటకు వస్తుంది. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్గా ముందుగా పూజ హెగ్డే పేరు వినిపించింది కానీ ఇప్పుడు నాగా చైతన్య కూడా ఆమెకు భారీ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డేని తప్పించి ఆమె స్థానంలో ప్రస్తుతం సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతున్న మీనాక్షి చౌదరిని హీరోయిన్గా తీసుకుబోతున్నారని తాజాగా ఓ వార్త వినిపిస్తుంది.