గవర్నమెంట్ జాబ్ వదులుకొని మరి.. అతను జబర్దస్త్ లోకి వచ్చాడా.. ఎవరో తెలుసా?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా బుల్లితెరపై సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ కనీ విని ఎరగని రీతిలో భారీ రేటింగ్ సొంతం చేసుకుంది. అతిపెద్ద కామెడీ షోగా ఎదిగింది. అయితే కామెడీ షో గా ఎదగడమే కాదు ఇండస్ట్రీలోకి రావాలని పాట్లు పడుతున్న ఎంతోమందికి మంచి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఎంతోమంది ప్రస్తుతం అటు వెండితెరపై కూడా ఒక వెలుగు వెలుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. తమదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. కొంతమంది హీరోలుగా కూడా మారి రాణిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే చిన్నప్పటినుంచి సినిమాల మీద పిచ్చితో ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళు తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకొని జబర్దస్త్ లోకి వెళ్లినవారు ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కమెడియన్ అయితే ఏకంగా గవర్నమెంట్ జాబును సైతం వదిలేసి జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడట. ఇక ఇప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకొని.. టాప్ టీమ్ లీటర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అతను ఎవరో కాదు వెంకీ మంకీ. సుమారు పదేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోలో కొనసాగుతున్నాడు వెంకీ మంకీ. తనదైన పంచులు ప్రాసలతో అందరిని కడుపుబ్బనవిస్తున్నాడు.

 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జబర్దస్త్ కమెడియన్ వెంకి తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకోసమే మంచి ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నప్పటికీ ఇక అది వదులుకొని మరి జబర్దస్త్ కు వచ్చాను అంటూ వెంకీ చెప్పుకొచ్చాడు. ఇక జబర్దస్త్ షో ద్వారా తన కల నెరవేరింది అంటూ చెప్పాడు.. నేను మామూలుగా ఒక మిమిక్రీ ఆర్థిస్ట్. అక్కడక్కడ షోస్ చేస్తూ ఉండేవాన్ని. అలాంటి సమయంలోనే చమ్మక్ చంద్ర నన్ను చూసి జబర్దస్త్ కు పిలిచాడు. కమెడియన్గా ఇక్కడ మంచి గుర్తింపు కూడా వచ్చింది. డైరెక్టర్ కావాలని ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. స్క్రిప్ట్ రాయడంలో నాకు అంతో ఇంతో అనుభవం ఉంది. యాక్టింగ్ కూడా కొద్దిగా తెలుసు. అందుకే ఎక్కువ కాలం జబర్దస్త్ లో ఉండగలిగాను. నిజం చెప్పాలంటే జబర్దస్త్ నాకు జీవితాన్ని ఇచ్చింది. ఆ కామెడీ షో నే నాకు కడుపు నింపింది అంటూ చెప్పుకొచ్చాడు వెంకీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: