గంగవ్వ స్టేజ్ మీదకి ఎందుకు వెళ్ళలేదు.. అసలు విషయం చెప్పేసిందిగా?

praveen
బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ ప్రేక్షకులను అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. కాగా ఇప్పటికే 70 రోజులు పూర్తి చేసుకోగా ఎప్పటి లాగానే నామినేషన్ ఎలిమినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఎనిమిదవ సీజన్లో వైల్డ్ కార్డుద్వారా మాజీ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. ఈ క్రమంలోనే ఇలా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ లో గంగవ్వ కూడా ఒకరు. దాదాపు 5 వారాల పాటు హౌస్ లో కొనసాగిన ఆమె ఇక అనారోగ్య కారణాల వల్ల హౌస్ నుంచి బయటకు వచ్చారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా హౌస్ నుంచి బయటికి వచ్చిన గంగవ్వను కనీసం అటు స్టేజి మీదకి కూడా పిలవలేదు నాగార్జున. దీంతో ఏదో వివాదం జరగడం కారణంగానే బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వను స్టేజి మీదకి పిలవలేదు అంటూ ప్రచారం జరుగుతుంది. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ నుండి మళ్ళీ అవకాశం రావడంతో హౌస్ లోకి వెళ్ళాను. అందరూ నన్ను బాగా చూసుకున్నారు. నాలుగవ సీజన్లో ఫుడ్ బాగుండేది. కానీ ఎనిమిదవ సీజన్లో ఫుడ్ బాగాలేదు. వారానికి సరిపడా ఫుడ్ ఒకేసారి చేసుకోవాలి. మూడు వారాలు బాగానే గడిచింది. దసరా, బతుకమ్మ వేడుకలు కూడా చేసుకున్నాం. మంగ్లీ వచ్చి పాట పాడి వెళ్ళిపోయింది. ఇక దీపావళి పండుగ ముందు అటుకులతో చేసిన పోహా తిన్న. వయసు మీద పడటంతో ఆ పోహా తినడంతో నాకు జీర్ణం కాదు. దాంతో మోషన్స్ మొదలయ్యాయ్. అవినాష్ కి చెబితే సెట్ అవుతుందిలే అవ్వ అన్నాడు. ఇక నాలుగైదు రోజులు పోతే అంత సెట్ అవుతుందని అనుకున్న. కానీ సడన్గా హౌస్ నుంచి బయటకు రమ్మన్నారు. వాస్తవానికి హౌస్ నుంచి బయటకు రావాలని లేదు. ఆరోజు ఫుడ్ బాలేదు. ఒకవేళ అడిగి ఉంటే చిన్న సమస్య కాస్త సెట్ అయ్యేది. మరో నాలుగు రోజులు ఉండి ఉంటే అంత నార్మల్ స్థితికి వచ్చేది.  మరో మూడు నాలుగు రోజులు హౌస్ లోనే ఉండాలి అని అనుకున్నాను. కానీ అప్పటికే బయటికి రమ్మని చెప్పారు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ నేను వెళ్తూ ఉండడంతో ఎడ్చేశారు. నాకు హౌస్ నుంచి బయటకు రావడం ఇష్టం లేకపోయినా బయటికి పంపించారు. అందుకే నన్ను స్టేజి పైకి తీసుకురాలేదు అంటూ గంగవ్వ అసలు నిజాన్ని బయటపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: