50 ఏళ్ల దగ్గరలో కుర్రాడితో ప్రేమలో పడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఏకంగా ఇన్ స్టాలో రచ్చ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్లలో అమీషా పటేల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మొదటగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి క్రేజ్ తెలుగులో వచ్చింది. ఆ తర్వాత ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన నరసింహుడు , మహేష్ బాబు హీరోగా రూపొందిన నాని సినిమాలో నటించింది.
 

కానీ ఈ రెండు మూవీ లు మాత్రం ఈ ముద్దుగుమ్మకు మంచి విజయాలను అందించలేదు. ఇక ఆ తర్వాత ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇలా కెరియర్ ఫుల్ జోష్లో ముందుకు సాగుతున్న సమయంలోనే ఈమె విక్రమ్ బట్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలా కాలం పాటు డేటింగ్ కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరు విడిపోయారు. ఆ తర్వాత చాలా కాలం కాటు ఒంటరిగా ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత కొంతకాలానికి ఓ nri తో ప్రేమలో పడింది. ఇక ఈ ప్రేమ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ఈయనతో కూడా ఈమె బ్రేకప్ చెప్పేసింది. ఇకపోతే ఈమె వయసు 50 కి దగ్గరగా వచ్చేసింది. మరి ఇంత కాలం పాటు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఈ బ్యూటీ కి పెళ్లి చేసుకునే సమయం వచ్చేసింది అని కొంతమంది చెప్పుకుంటున్నారు.

అది ఎందుకు అంటే ఈమె తాజాగా మరో యువకుడితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో నా డార్లింగ్ నిర్వన్ బిర్లా తో లవ్లీ సాయంత్రం అంటూ ఓ ఫోటో పోస్ట్ చేసి దానికి ఈ క్యాప్షన్ ను జోడించింది. ఇందులో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. దానితో త్వరలోనే ఈ బ్యూటీ నిర్వాన్ బిర్లా ను పెళ్లి చేసుకుని అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: