క్రికెటర్ అవ్వాలనుకున్నాడు .. కట్ చేస్తే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో.. క్రేజీ హీరోయిన్స్ తో డేటింగ్..!
ఇలా చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్న ఆదిత్య రాయ్కి అసలు కల వేరే ఉందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు .. ఆదిత్య రాయ్ క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడు .. అయితే ఎందుకో గాని ఆ కలను పూర్తిగా పక్కన పెట్టి ఆ తర్వాత నటనలోకి వచ్చారు.అలాగే ఆదిత్య రాయ్ వీడియో జాకీ అని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు . ఈ బాలీవుడ్ హీరో కి పెద్దగా బ్యాగ్రౌండ్ లేదని కూడా అనుకోకండి.. ఈయన సినిమా ఇండస్ట్రీ నేపథ్యమున్న పెద్ద కుటుంబం నుంచే వచ్చాడు. ఆదిత్య రాయ్ కపూర్ సోదరుడు మరెవరో కాదు సిద్ధార్థ్ రాయ్ కపూర్ .
ఇక ఇతను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కూడా అలాగే నటి విద్యాబాలన్ భర్త . ఈ విధంగా ఆదిత్య కి చిత్ర పరిశ్రమ లోకి రావడానికి పెద్ద కష్టమేమీ అనిపించలేదు. అంత గొప్ప బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తన్ను తాను నిరూపించుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు ఆదిత్య .. ప్రస్తుతం ‘మెట్రో ఇన్ ధిల్లాన్’ అనే సినిమా చేస్తున్నాడు .. తాజాగా ఈ సినిమా కోసం తన లుక్ కూడా మార్చుకున్నాడు. అన్నట్లు సినిమాలతో పాటు డేటింగ్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు ఆదిత్య రాయ్. శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్, దివా ధావన్, సోనాక్షి సిన్హా, నిధి అగర్వాల్, రియా చక్రవర్తి, అహానా డియోల్, అనన్యా పాండే.. ఇలా స్టార్ హీరోయిన్లతో ఆదిత్య రాయ్ డేటింగ్ చేసినట్లు బాలీవుడ్ లో ప్రచారం జరిగింది.