మంటలు పుట్టిస్తున్న మసుద బ్యూటీ .. దెయ్యం పిల్ల అందానికి ఎవరికైనా కారాల్సిందే..!

Amruth kumar
టాలీవుడ్ సినీయ‌ర్‌ నటి సంగీత ప్రధాన పాత్రలో తెలుగులో వచ్చిన హారర్ మూవీ మసూద చాలామందికి గుర్తుండే  ఉంటుంది. ఆ సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించిన బాంధవీ శ్రీధర్ అందరికీ బాగా గుర్తుండిపోయారు .. త‌న‌ క్యూట్ లుక్స్ తో, మెస్మరైజింగ్ స్మైల్‌తో ఆ అమ్మాయికి మంచి మార్కులే పడ్డాయి. అచ్చ తెలుగంటి అమ్మాయి అయినా బాంధవి ఇప్పుడు మరింత అందంగా మారిపోయింది. తాజాగా ఆమెకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన బాంధవి హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. మిస్టర్ పర్ఫెక్ట్ , రభస , మొగుడు , రామయ్య వస్తావయ్య , మజ్ను వంటి సినిమాల్లో నటించింది.

అలాగే 2019లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో కూడా రన్నర్ గా నిలిచింది. అదే సంవత్సరం జరిగిన మిస్ ఆంధ్రప్రదేశ్ 2019 పోటీలలో విజేతగా కూడా నిలిచారు. ఆ తర్వాత మళ్లీ రావా , ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు బాంధవీ శ్రీధర్. అయితే మసూద మూవీ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయం అందుకోవటంతో పాటు బంధువి కి కూడా మంచి క్రేజ్‌ తీసుకొచ్చింది. మసుధ హిట్ అయిన తర్వాత బాంధవి ఎక్కడ ఏ సినిమాలోనో కనిపించలేదు .. ఈ చిన్నది సినిమాలు మానేసిందా అని కూడా అంతా అనుకున్నారు. కానీ ఆమె హీరోయిన్గా అవకాశాల కోసం తన ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న జాట్‌లో బాంధవి మంచి అవకాశం అందుకుంది.

ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, సయామి ఖేర్  హీరోయిన్లుగా నటిస్తుండగా .. ఆయేషా ఖాన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక‌ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే బాంధవి శ్రీధర్ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు , ఇతర విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు . అన్నింటికి మించి హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారులో సెగలు రేపుతుంటారు. తాజాగా బ్లాక్ కలర్ డీప్ నెక్ ఔట్‌ఫిట్‌లో నడుము, ఎద అందాలు చూపిస్తున్న ఫోటోలను బాంధవి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ షేర్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


auto 12px; width:50px;">
View this post on Instagram
A post shared by Bandhavi {{RelevantDataTitle}}