సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతున్న రాజమౌళి..కారణం ఏంటంటే..?
రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ చరిత్ర ఎప్పటికీ ఇండియన్స్ మరిచిపోలేనిది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు . అలాంటి రాజమౌళిని ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకతాయిలు హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు . దానికి కారణం ఆయన పుష్ప 2 ట్రైలర్ పై స్పందించడమే . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ చాలా చాలా ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా పుష్ప2.
రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది . ట్రైలర్ బాగుంది. సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ ఓకే చూడొచ్చు అన్న రేంజ్ లో ఉంది . మరీ ముఖ్యంగా "పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివ కాదు ఫైర్ అనుకుంటివ కాదు కాదు వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ బాగా క్లిక్ అయింది". ఇదే డైలాగ్ ను వాడుతూ రాజమౌళి పుష్పను ఓ రేంజ్ లో పొగిడేసారు . "ఈ వైల్డ్ ఫైర్ దేశమంతా పాకిపోతుంది" అంటూ పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామన్న విషయాన్ని ట్వీట్టర్ వేదికగా బయటపెట్టాడు . అయితే ఇక్కడే రాజమౌళి దొరికిపోయాడు . చిన్న సినిమాలకు రాజమౌళి సపోర్ట్ చేయడా..? చిన్న హీరోలు రాజమౌళి కంటికి కనపడడా..? అంటూ జనాలు మండిపడుతున్నారు. రీసెంట్గా ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి ..ఆ సినిమాలు హిట్ అందుకున్నాయి. అయితే ఆ సినిమాలపై రాజమౌళి నోరు విప్పక పోవడం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది . ఈ కారణంగానే ఆయన సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు..!