ఆ స్టార్ హీరోయిన్ చికెన్ పిచ్చికి నరకం చూసిన నిర్మాతలు.. అందుకే ఆఫర్లు ఇవ్వట్లేదా?
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ మాత్రం రోజుకు మూడు పూటలా చికెన్ మెనూలో ఉండాల్సిందేనని పట్టుబట్టి ఇప్పుడు ఆఫర్లు లేక ఇండస్ట్రీకి దూరమైంది. నార్త్ ఇండియాకు చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోలకు, మిడిల్ రేంజ్ హీరోలకు, యంగ్ హీరోలకు సైతం జోడీగా నటించింది. అందం, అభినయంతో మెప్పించే ఈ ముద్దుగుమ్మ షూట్ జరిగినన్ని రోజులు తను కోరిన చికెన్ వెరైటీలు కచ్చితంగా కావాలని చెప్పి నిర్మాతలకు చుక్కలు చూపించేదట.
స్టార్ హీరోలు సైతం ఆహారం విషయంలో ఎలాంటి రూల్స్ పెట్టకుండా ఉంటారని ఈ హీరోయిన్ మారుమూల ప్రాంతాల్లో షూట్ జరుగుతున్న సమయంలో సైతం తను అడిగిన వంటకాలు తెప్పించకపోతే నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారని సమాచారం. ఇండస్ట్రీలో ఇలాంటి హీరోయిన్ ను ఎప్పుడూ చూడలేదని నిర్మాతలు సైతం తమ సన్నిహితులతో చెప్పేవారట.
ప్రస్తుత కాలంలో సినిమా నిర్మాణం అంటే తలకు మించిన భారమవుతోంది. హీరోలు, హీరోయిన్లు ఇష్టమైనవి కావాలంటే సొంత డబ్బులను ఖర్చు చేస్తే మంచిది. నిర్మాతలను ఇబ్బంది పెడుతూ వ్యవహరిస్తే అలాంటి హీరోలు, హీరోయిన్లకు కొత్త ఆఫర్లు రావడం కష్టమవుతుంది. సినిమా నిర్మాతలు సైతం హీరోలు, హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇచ్చే సమయంలోనే వ్యక్తిగత ఖర్చులకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు విధిస్తే ఈ తరహా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు..