శ్రీలీల ముద్దుగా అల్లు అర్జున్ ని అలా పిలుస్తుందా.. బన్నీ ఫ్యాన్స్ ఇంప్రెస్స్..!

Thota Jaya Madhuri
శ్రీ లీలా అంటే ఒక యంగ్ హీరోయిన్ ..ఒక స్టార్ హీరోయిన్ ..చాలా బాగా డాన్స్ చేస్తుంది. చాలా బాగా నటిస్తుంది.  అందరితో బాగా మింగిల్ అవుతుంది . అలాగే మూవ్ అవుతుంది . ఇంతవరకే తెలుసు . అయితే చాలా మంది శ్రీలీలను సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  మరీ ముఖ్యంగా శ్రీలీల పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వదు అని కొందరు ఆకతాయిలు విపరీతంగా ఆమెను ట్రోల్ చేశారు . అయితే రీసెంట్గా వాటికి చెక్ పెట్టేసింది శ్రీలీల .


పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ లో చిందులు వేయబోతుంది శ్రీలీల. ఈ పాట చిత్రీకరణ్ మొత్తం కూడా పూర్తి అయిపోయింది.  దీనికి సంబంధించిన ఆఫీషియల్ అప్డేట్ కూడా ఎప్పుడో రిలీజ్ చేసేసారు మేకర్స్ . ఈ పాటని ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  అయితే ఇప్పుడు శ్రీలీల చేసిన ఒక పని అభిమానులకి చాలా చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది.


రీసెంట్గా శ్రీ లీల - అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్ పంపించింది . దానికి సంబంధించిన పిక్ ను అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ "థాంక్యూ డియర్" అంటూ ఆమెను ఓ రేంజ్ పొగిడేశారు. అయితే అదే స్క్రీన్ షాట్ ను మళ్లీ శ్రీలీల తన ఇంస్టాగ్రామ్ లో పెట్టి "థాంక్యూ సర్" అంటూ అల్లు అర్జున్ పోస్ట్ కి రిప్లై ఇచ్చింది.  దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ వైరల్ గా మారాయి . అల్లు అర్జున్ ని సార్ అంటూ శ్రీలీల పిలవడం అభిమానులకి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది . చాలామంది హీరోయిన్స్ అల్లు అర్జున్ తో వర్క్ చేశారు.  కానీ ఎవరు కూడా ఇలా సార్ అంటూ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడలేదు . శ్రీ లీలా మాత్రమే ఇలా చేయడంతో శ్రీలీలను పొగిడేస్తున్నారు బన్నీ అభిమానులు . చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన పుష్ప2 ఐటమ్ సాంగ్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ..? ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: