తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కరుణ కుమార్ ఒకరు. పలాస అనే సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి కరుణ కుమార్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈయనకు మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత ఈ దర్శకుడు టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి సుదీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత ఈ దర్శకుడు సత్యం రాజేష్ హీరోగా కళాపురం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. దానితో పలాస లాంటి సినిమా తీసిన దర్శకుడు ఇంత వీక్ కథతో సినిమా తీయడం ఏంటి అనే విమర్శలు కూడా ఈయనపై వెల్లువెత్తాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఈయనకు సినిమా అవకాశం ఇచ్చాడు. దానితో ఈ దర్శకుడు వరుణ్ తేజ్ హీరోగా మట్కా అనే మూవీని రూపొందించాడు.
ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో చాలా మంది పలాస సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆ తర్వాత వరుస అపజయాలను అందుకుంటున్నాడు. ఇకనైనా ఈ దర్శకుడు మంచి విజయాన్ని అందుకోకపోతే కెరియర్ ముందుకు సాగడం కష్టమే అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.