బాలయ్య.. చరణ్ ముందున్న వెంకీ కి ఇంతా డిమాండా.. ఇదంతా కాంబో క్రేజేనా..?

Pulgam Srinivas
వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఓ మూడు సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఆ మూడు సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక బాలయ్య హీరోగా బాబి దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రూపొందుతుంది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక చరణ్ నటించిన గేమ్ చేంజర్ , బాలయ్య నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదలకు రెడీగా ఉండడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీ అంచనాలు నెలకొనే అవకాశం తక్కువ అని కొంత మంది అంచనా వేశారు. కానీ వారి అంచనాలను సంక్రాంతికి వస్తున్నాం సినిమా తారుమారు చేసింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ నిర్మాత ఈ సినిమాను మొత్తం 100 కోట్ల బడ్జెట్తో పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీకి ధ్రియేటికల్ బిజినెస్ ద్వారా 75 కోట్ల బిజినెస్ , నాన్ ధ్రియేటికల్ బిజినెస్ 30 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. దీనితో సినిమా విడుదలకు ముందే ఐదు కోట్ల మేర టేబుల్ ప్రాఫిట్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో వెంకీ , అనిల్ కాంబోలో రూపొందిన ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాలు సాధించడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అందుకే ఈ స్థాయిలో ఈ మూవీ కి బిజినెస్ జరిగింది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: