లావణ్య త్రిపాఠి సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా.. మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం తర్వాత వస్తున్న రూమర్లకు వరుణ్ తేజ్ స్వయంగా స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో లావణ్య త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనలన్నీ మరచిపోయి, ఇప్పుడు లావణ్య ఎలాంటి ఒత్తిడి లేకుండా తనకు నచ్చిన పాత్రలు ఎంచుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉండి, కొత్త కథలు వినడం జరుగుతుంది. త్వరలోనే ఆమె సినిమాల్లో కనిపించబోతుందని వరుణ్ తేజ్ తెలిపారు. ఇది ఆ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ కి చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరూ కలిసి నటించేందుకు తగిన కథ, పాత్రలు దొరికితే తప్పకుండా సినిమా చేస్తామని తెలిపారు. లావణ్య తనకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉందని, మెగా ఫ్యామిలీ ఆమెపై ఎలాంటి నిబంధనలు విధించలేదని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. వివాహం తర్వాత కూడా లావణ్య తన నిర్ణయాలను స్వయంగా తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉందని వారు చెప్పారు.
వరుణ్ తేజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య త్వరలోనే సినిమాల్లోకి తిరిగి వస్తుందనే ఆశతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, అందాల రాక్షసి లాంటి మంచి సినిమాలు ఆమె నుంచి వస్తే చూసి ఎంజాయ్ చేయాలని ఎంతో కోరుకుంటున్నారు. మరి ఈ మెగా కోడలు వారి కోరికను ఎప్పుడూ నెరవేరుస్తుందో చూడాలి.