వేశ్యను హీరోయిన్ చేసిన ఎన్టీఆర్... ఎవరో తెలుసా?
సరిగ్గా అలాంటి సమస్యే అలనాడు హీరోయిన్ "రాజసులోచన" అసలు పేరు రాజలోచనకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులకు లేక లేక పుట్టిన ఏకైక బిడ్డ కావడంతో ఎంతో గారాబంగా పెరిగింది. ఈ క్రమంలో అప్పట్లో రాజ అనే పదం గౌరవంగా ఉండడంతో దీనిని ఆమె పేరులో చేర్చి.. ఆమెకి రాజలోచన అని నామకరణం చేసారు. కానీ, స్కూల్లో జాయిన్ చేసే సమయంలో ఆమె పేరును రాజసులోచనగా మార్చేశారు టీచర్స్. ఇక, అప్పటి నుంచి ఆమె రాజసులోచనగా మారిపోయింది. కాగా ఆమెకు చిన్నప్పటినుండి డ్యాన్స్ అంటే ప్రాణం. ఒకే కుమార్తె కావడంతో తల్లిదండ్రులు బాగానే ప్రోత్సహించారు. ఇలా.. సినిమాల్లోకి వచ్చిన ఆమెకు తొలిపాత్రే.. వేశ్య పాత్ర దక్కడంతో చేయకతప్పింది కాదు.
తర్వాత కాలంలో ఆమెకి వరుసగా వేశ్యపాత్రలు చేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇవి తప్ప ఇంకే పాత్రలు నాకు రావా? అనే ప్రశ్న ఆమె మదిలో మెదిలింది. అయినా.. ఆమె సర్దుకుపోతూ వెళ్లిపోయేవారు. దీంతో ఎక్కడ ఎవరు కలిసినా.. మీరు ఆ సినిమాలో వేశ్య పాత్రలో జీవించారు! అంటూ చెప్పేవారట. అలా ఆమె అంటే ఓ వేశ్య పాత్రలు మాత్రమే వేసే హీరోయిన్ అన్న ముద్ర కూడా పడిపోయింది. ఇది చాలా ఇబ్బందిగా ఉండేదట. ఇలా.. కొన్నాళ్లకు ఆమెకి "బందిపోటు" సినిమాతో అన్నగారు ఎన్టీఆర్ హీరోయిన్ చాన్స్ ఇచ్చారట. అలా ఆమె తరువాతికాలంలో హీరోయిన్గా 4 సినిమాలు చేశారు.