పవర్ స్టార్ క్రేజ్ కు తగ్గట్టుగా బాణిలందించి యూత్ ను ఊర్రుతలూగించిన మెలోడీ బ్రహ్మ.!

FARMANULLA SHAIK
తెలుగు సినిమా ఇండస్ట్రీలోఎవరి పేరు చెబితే బీజీఎమ్ బద్దలవుతుందో ఎవరి పేరు నటరాజును నాట్యమాడించగలదోఎవరి పేరు సంగీత కిరీటానికి సరితూగగలదో ఆయనే మణిశర్మ.ఆయన మొదటగా సంగీత దర్శకుడు చెళ్ళపిళ్ళ సత్యం దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు.ఆ తర్వాత ఇళయరాజా,ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర శిష్యరికం చేసారు.ఎ. ఆర్. రహ్మాన్ తో కలిసి కీబోర్డు సహాయకుడిగా పనిచేశాడు.ఈయన సంగీతం చాలా వరకు ఫాస్ట్ బీట్ తో, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది అలాగే  ఆయన ప్రతీ సినిమాలో కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది కనుక అందుకే అతనిని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తారు.ఆయన పూర్తి పేరు నమండ్ర వెంకట సుబ్రహ్మణ్యశర్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీ మణిహారంగా నిలిచేందుకు ఆయనకాయన మార్చుకున్న పేరు మణిశర్మ.
ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసరికి మణిశర్మ స్పీడ్కు కొద్దిగా బ్రేక్ పడిందనే చెప్పాలి కానీ పదేళ్ల క్రితం ఆయన పేరుకున్న బ్రాండ్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్టార్ హీరోలు సైతం ఆయన కోసం క్యూ కట్టి వారి సినిమా పోస్టర్‌లో పేరు కోసం ప్రాకులాడారంటే ఆ పేరుకి, ఆయన ఇచ్చే సంగీతానికి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ మాస్ స్టెప్స్ వేయాలన్నా నటసింహం ఊరమాస్ డైలాగ్స్ చెప్పాలన్నా  కింగ్ కుర్రహీరోయిన్లని కవ్వించాలన్నా విక్టరీ సెంటిమెంట్‌తో కొట్టాలన్నా వెనుక మణిశర్మ చేతులు కదలాల్సిందే. నేను కాదు నా సంగీతమే మాట్లాడుతుంది అంటూ ఎప్పుడూ, ఎక్కడా ఇప్పుడున్న సంగీత దర్శకుల్లా  అతిగా మాట్లాడిందీ లేదు, వారిలా ఆవేశపడిందీ లేదు. ఒకటే స్ట్రాటజీ తన మ్యూజిక్కే తనకు ప్రాణం. కుర్ర సంగీత దర్శకులు వచ్చాక ఒక అడుగు వెనక్కి పడి ఉండవచ్చు.కానీ మంచి ఛాన్స్ పడితే ఇప్పటికీ ఇరక్కొట్టగలనని ఇస్మార్ట్ గా నిరూపిస్తూనే వస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా కుర్ర సంగీత దర్శకుల వెంట పడుతుంటే కుర్ర హీరోలు మాత్రం మణిశర్మ ట్యాగ్ తమ సినిమా టైటిల్ కార్డ్స్‌లో ఉంటే మహాభాగ్యం అనుకునేలా అన్ని రకాల హీరోలను శాటిస్‌ఫై చేస్తున్న స్వరమాంత్రికుడు మణిశర్మ.
ఆయన ఎన్నో సినిమాలకు తన సంగీత స్వరాన్ని అందించారు అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ హిట్ మూవీస్‌లో ఖుషి ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌‌జే సూర్య 2001లో రూపొందించిన ఈ సినిమా పవన్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్‌కు జోడీగా భూమిక నటించగా సపోర్టింగ్ రోల్‌లో శివాజీ, అలీ కనిపించారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎస్సెట్‌గా నిలిచింది. పాటలన్నీ చాలా ఏళ్ల పాటు జనాల నోళ్లలో నానాయి.ఈ ఖుషి సినిమా లో మణిశర్మ స్వరపరిచిన ప్రతి పాటా ఆణిముత్యమే. అందులో పవన్కళ్యాణ్ నటించిన ఖుషి మూవీ సాంగ్స్ అయితే ఆల్ టైమ్ హిట్స్. ఇప్పటి యూత్ ని కూడా ఆ పాటలు మైమరిపించేయాలా చేస్తున్నాయి.అప్పట్లో ఆ మూవీలో పాటలు కుర్రోళ్లను ఒక ఊపు ఊపేలా చేసాయి ఇప్పటికి కూడా కాలేజీ ఫంక్షన్స్, లవ్ ప్రపోజ్ చేసే సందర్భాల్లో ఆ మూవీలోని పాటలు తెగ వైరల్ అవుతుంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: