టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య , మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శోభిత ధూళిపాల ఇద్దరి వివాహం కొన్ని రోజుల్లోనే జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే వీరిద్దరి ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది . ఇక పెళ్లిని మాత్రం ఘనంగా నిర్వహించాలి అనే అక్కినేని కుటుంబం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది . ఇక ఇప్పటికే శోభిత , అక్కినేని నాగార్జున కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో చురుగ్గా పాల్గొంటుంది . కొన్ని రోజుల క్రితమే అక్కినేని నాగేశ్వరరావు అవార్డుల వేడుకను నాగార్జున నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సారి అవార్డును మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చారు.
ఈ అవార్డుల వేడుకను నిర్వహించే క్రమంలో శోభిత అత్యంత కీలక పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇక ఈ అవార్డు వేడుకలో శోభిత స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలిచింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4 వ తేదీన నాగ చైతన్య , శోభిత ధూళిపాల పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించాలి అని వీరిద్దరి తరపు బంధువులు డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే నాగ చైతన్య కు భారీ ఎత్తున కానుకలను శోభిత తల్లిదండ్రులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య కు రేసింగ్ కార్లు అంటే చాలా ఇష్టం. దానితో శోభిత తల్లిదండ్రులు చైతన్య కు ఒక ఆడి కారును , ఆజ్ ఒక స్పోర్ట్స్ బైక్ ను కానుకగా ఇవ్వబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. వీటితో పాటు హైదరాబాదు లో ఒక విలాసవంతమైన విల్లా ను కూడా కానుకగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా నాగ చైతన్య కు శోభిత తల్లిదండ్రులు పెద్ద మొత్తంలోనే కానుకలను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.