హీరో సూర్య ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారా.. కానీ.?

Pandrala Sravanthi
 కోలీవుడ్ నటుడు సూర్య అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.ఎందుకంటే ఈయన చేసిన సినిమాలు కేవలం కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి.అలా తెలుగులో కూడా ఎంతోమందికి అభిమాన హీరోగా మారిపోయిన సూర్య పేరు చెప్పగానే హీరోయిన్ జ్యోతిక కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే వీరిద్దరూ భార్యాభర్తలు.. కేవలం హీరో హీరోయిన్లు గానే కాదు భార్యాభర్తలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటగా సౌత్ ఇండస్ట్రీలో వీళ్లు పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ఈ జంట గురించి తాజాగా నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..

సూర్య మొదట ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారని, ఆ హీరోయిన్ అంటే ఆయనకు చాలా క్రష్ అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరు.. అసలు విషయం ఏంటి అనేది చూస్తే.. నటుడు సూర్య బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లోకి గెస్ట్ గా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ సమయంలో నటుడు కార్తీ మా అన్నయ్యకు మా వదిన జ్యోతిక కంటే ముందే మరో హీరోయిన్ అంటే క్రష్ అంటూ ఒక సంచలన విషయం చెప్పారు. ఇక ఆ హీరోయిన్ ఎవరో కూడా కార్తి బయట పెట్టారు.ఆమె ఎవరో కాదు సీనియర్ నటి గౌతమి.అవును మీరు వినేది నిజమే..

ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా కార్తీ తన నోటితో తానే బయటపెట్టిన విషయం. మా అన్నయ్య సూర్యకి హీరోయిన్ గౌతమి అంటే చాలా ఇష్టం.ఆవిడ అంటే పడి చచ్చిపోతాడు. గౌతమి గారికి సంబంధించిన ఏ సినిమా కూడా మిస్ కాకుండా చూసేవాడు అంటూ కార్తీ ఓ సంచలన విషయం చెప్పారు.దీంతో ఈ విషయం తెలిసిన సూర్య అభిమానులు జ్యోతిక కంటే ముందే సూర్యకి నటి గౌతమి ఫస్ట్ క్రష్ అంటే ఒకవేళ గౌతమి వయసులో ఆయన కంటే చిన్నదైతే కచ్చితంగా పెళ్లి చేసుకునే వాడు కావచ్చు.. కానీ వయసులో పెద్దది కాబట్టి వీరిద్దరి మ్యాచ్ కుదరలేదు లేకపోతే సూర్య జ్యోతికను కాకుండా గౌతమినే పెళ్లాడేవారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: