ప్లీజ్ అంటూ కమల్ హాసన్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటంటే..
సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, "సినిమా అనేది ఒక్క వ్యక్తికి చెందినది కాదు. అది అనేక మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకుల కలిసి చేసే కళారూపం. నేను సినిమా విద్యార్థిగా భావిస్తాను. ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ఉత్సాహంగా ఉంటాను" అని ఆయన అన్నారు. "కళాకారుడు కళ కంటే గొప్పవాడు కాదని నేను నమ్ముతాను. నేను నా లోపాలను గుర్తించి, మరింత మెరుగుపడాలని కోరుకుంటాను. అందుకే, చాలా ఆలోచన తర్వాత, నేను అన్ని బిరుదులు, ప్రిపెక్స్‌లను వినయంగా తిరస్కరించాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన అన్నారు.
తన అభిమానులు, మీడియా, సినీ పరిశ్రమ సభ్యులు, భారతీయులందరినీ ఉద్దేశించి, "దయచేసి నన్ను కమల్ హాసన్, కమల్ లేదా కేహెచ్ అని పిలవండి. నా మూలాలకు కనెక్ట్ అయి ఉండాలనే కోరికతో ఇలా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అందమైన కళారూపాన్ని ప్రేమించే మీ అందరిలో నేను ఒకడిగా ఉండాలని కోరుకుంటాను" అని కమల్ హాసన్ ముగించారు. కమల్ చిత్రం 'థగ్ లైఫ్' సినిమాతో త్వరలోనే పలకరించనున్నాడు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రం 2025 జూన్ 5న విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సిలంబరసన్ టీఆర్, జయం రవి, త్రిష, అభిరామి, నాజర్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఏ.ఆర్. రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.