పెళ్లికి ముందు బ్రేకప్ చెప్పేసుకుంటున్న టాలీవుడ్ రొమాంటిక్ ప్రేమ పక్షులు.. ఫ్యాన్స్ కన్నీళ్లు..!?
వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి కూడా అలానే ఉంటుంది. కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో టాలీవుడ్ యంగ్ హీరో హీరోని సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు . ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎంతలా అంటే అంతకుముందు ఆ హీరో ఆ హీరోయిన్ పలు సినిమాలో నటించిన వాళ్లకంత గుర్తింపు రాలేదు. ఈ సినిమా డైరెక్టర్ పుణ్యమో..?? లేక వీళ్లిద్దరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందో..?? సినిమా మంచి హిట్ అందుకొని కోట్ల ప్రాఫిట్స్ తీసుకొచ్చింది . ఆ తర్వాత వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది.
మరీ ముఖ్యంగా పలు పార్టీస్ కి ప్రైవేట్ ఫంక్షన్స్ కి కూడా బాగా కలిసి అటెండ్ అవ్వడం ప్రారంభించారు. దీంతో సోషల్ మీడియాలో వీళ్లు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి . ఒకరికి ఒకరు గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవడం.. ఒకరి వేసిన షర్ట్స్ మరొకరు వేసుకోవడం .. వామ్మో ఒకటా..? రెండా..? రేపే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకుంటారు అన్న రేంజ్ లో బిహేవ్ చేశారు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ హీరోయిన్ కి అవకాశాలు ఓ రేంజ్ లో వచ్చేస్తున్నాయి .
హీరో పరిస్థితి అలా లేదు హీరో ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆ హీరోయిన్ అతగాడిని దూరం పెట్టేసింది అని కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుంది అంటూ ప్రచారం జరుగుతుంది. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపించిన ఈ జంటపై ఇప్పుడు బ్రేకప్ చెప్పేసుకున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి . దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా బాధపడిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అంటూ ఉంటే కొందరు ..మరికొందరు మాత్రం దీన్ని ప్రేమ అనరు దానికి వేరే అర్థాలు ఉన్నాయి అని బోల్డ్ గా స్పందిస్తున్నారు..!