కమర్షియల్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్ లకి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. కమర్షియల్ సినిమా అంటే చాలు అందులో ఐటెమ్ సాంగ్స్ ఉండాలి అని ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉంటారు. అందుకు తగినట్లు గానే మేకర్స్ కూడా ఏదో ఒక సిచువేషన్ లో ఒక మంచి ఐటమ్ సాంగ్ పెట్టి ప్రేక్షకులకు మంచి కేక్ ని ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానితో ఈ మధ్య కాలంలో ఐటమ్ సాంగ్స్ కి డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. మరి ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ అంటే అందులో నటించే ముద్దు గుమ్మలకు కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా నిర్మాతలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే కొంత కాలం క్రితం సమంత , అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సమంత స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , ఈ సాంగ్లో సమంత తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈమెకు కూడా ఈ సాంగ్ ద్వారా సూపర్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే ఈ సాంగ్ కోసం సమంత కోటిన్నర పారితోషకం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఊర్వసి రౌటేలా అనే బాలీవుడ్ బ్యూటీ వరుస పెట్టి స్పెషల్ సాంగ్స్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈమె చేస్తున్న స్పెషల్ సాంగ్స్ కి దాదాపు ఒక్కో పాటికి మూడు కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు ఈ వార్త వైరల్ అవుతుంది. దీనితో స్టార్ హీరోయిన్ అయి ఉండి అద్భుతమైన క్రేజ్ ఉన్న సమంత కంటే ఊర్వశి రౌటేలా ఎక్కువ పారితోషకం స్పెషల్ సాంగ్స్ కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.