' గేమ్ ఛేంజ‌ర్‌ ' ను కాపాడేది అదొక్క‌టే... రామ్‌చ‌ర‌ణ్‌కు అదే ర‌క్ష‌...!

RAMAKRISHNA S.S.
మూడేళ్లు పైగా సెట్స్ మీదే ఉన్న గేమ్ ఛేంజ‌ర్‌.. ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజ‌ర్‌ రిలీజ్ కానుంది. పుష్ప, త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, చరణ్, బన్నీ ముగ్గురు పాన్ ఇండియా ఇమేజ్‌ నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతున్నారు. ప్రభాస్ ఇప్పటికే ఆ ప్లేస్ లోకి వెళ్లిపోయారు. మహేష్ వెళ్ళటానికి ఇంకా టైం పడుతుంది. పుష్ప‌తో వచ్చిన ఇమేజ్ మరింత పైకి తీసుకువెళ్లాలని బన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. సక్సెస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

దేవర సినిమాతో ఎన్టీఆర్ గట్టి ప్రయత్నం చేశారు. నిజానికి దేవరతో కొరటాల మరీ గొప్ప కంటెంట్ ఏమీ ఇవ్వకున్నా ఎన్టీఆర్‌కు ఉన్న ఇమేజ్ కలిసి సినిమాని సూపర్ హిట్ చేశాయి. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా పరీక్ష పాస్ అయిపోయినట్టే. ఇక రాబోయే సినిమాలు గురించి ఎలాగూ మంచి కాంబినేషన్లో ఉన్నాయి. కనుక ఎన్టీఆర్ కు ఇబ్బంది లేదు. ఇక మిగిలింది రామ్ చరణ్.. త్రిబుల్ ఆర్‌తో నార్త్ బెల్ట్ కు మంచి పరిచయం జరిగింది. ఇప్పుడు దానిని కొనసాగించాలి, నిలబెట్టుకోవాలి. గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో ఆ ప్రయత్నం కొంతవరకు చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా ఉంటుంది.

ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లైనప్‌తో చూసుకుంటే రామ్ చరణ్‌కు ఇంకా అంత గొప్పలైనప్‌ దొరకలేదు. బుచ్చిబాబు సినిమా తర్వాత ఏమిటి అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్. పైగా బుచ్చిబాబు పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉన్న దర్శకుడేనా అన్న సందేహం కూడా ఉంది. ఈ సినిమాపై మరీ అంచనాలు లేవు. దీనికి కారణం శంకర్ అంత ఫామ్ లో లేకపోవడం. పైగా భారతీయుడు 2 సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయింది. ఇక సంక్రాంతికి టాలీవుడ్ లోను గట్టి పోటీ ఉంది. బాలయ్య - బాబి వీర‌మాస్‌ వస్తోంది. బాలయ్య ఆ సినిమాలో రాబిన్ హుడ్ మాదిరిగా గజదొంగ గా కనిపించబోతున్నాడు. గుర్రాలు, దోపిడీ దొంగల కాలంలో కొనసాగే కథ‌ అది.

పైగా బాలయ్య‌ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. మరీ ముఖ్యంగా దేవర సినిమా విజయంలో ఎన్టీఆర్ అభిమానులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు గేమ్ ఛేంజ‌ర్‌ విజయంలో మెగా అభిమానులు కూడా ఒకే తాటి మీదకు వచ్చి చిరు అభిమానులు వేరు, పవన్ అభిమానులు వేరు, బన్నీ అభిమానులు వేరు అని కాకుండా గేమ్ ఛేంజ‌ర్‌ వరకు అండగా నిలబడితే కచ్చితంగా ఈ సినిమా సంక్రాంతి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: