సాహస వీరుడు సాగర కన్యతో శిల్పంలా మెరిసిన శిల్పాశెట్టి.. కానీ చివరికి.?

Pandrala Sravanthi
-
సాగర కన్యగా  టాలీవుడ్ లో గుర్తింపు..
- నాలుగు సినిమాలే చేసిన  మైలురాయిగా నిలిచిన శిల్పా పేరు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూర్వకాలంలో ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లే ఉండేవారు. ఇండస్ట్రీ డెవలప్ అయిన కొలది  తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువైపోయి హిందీ, కేరళ, మలయాళ ముద్దుగుమ్మలకి అవకాశాలు పెరిగిపోయాయి.  ఎక్కువగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వారి అదృష్టాన్ని పరీక్షించుకొని స్టార్లుగా మారారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శిల్పా శెట్టి.. ఈ ముద్దుగుమ్మ  టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా  అద్భుతమైన హిట్లు సాధించింది. అలాంటి ఈమె గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం..
 తెలుగు స్టార్ హీరోలతో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ.!
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు తెలుగు స్టార్ హీరోలతో బాలీవుడ్ హీరోయిన్స్ జతకట్టి ఎంతో పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎక్కువ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి తెలుగు సినిమా స్టార్ హీరో వెంకటేష్ మొదలు  బాలకృష్ణ వరకు ఎంతో మందితో  జతకట్టి మెరుపు మెరిసింది  బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. మరి ఈ అమ్మడు ఏ ఏ హీరోలతో ఎలాంటి సినిమాల్లో నటించింది అవి ఎంతటి హిట్లయ్యాయి అనే వివరాలు చూద్దాం.. శిల్పా శెట్టి మొదటిసారి తెలుగులో  రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చినటువంటి సాహసవీరుడు సాగర కన్య చిత్రంలో నటించింది.  ఇందులో వెంకటేష్ హీరోగా చేసి అద్భుతంగా నటించాడు. 

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె  అలనాటి స్టార్ నటుడు అయినటువంటి  మంచు మోహన్ బాబుతో నటించింది. ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో  వీడెవడండీ బాబు చిత్రంలో నటించి  బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.  అంతేకాకుండా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో ఆజాద్ సినిమాలో చేసింది.  తిరుపతి స్వామి డైరెక్టర్ గా అశ్వని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో  వచ్చినటువంటి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ అయింది. అలాంటి ఈమె చివరిగా బాలకృష్ణ హీరోగా నటించిన భలేవాడివి బాసూ చిత్రంలో నటించింది.  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో తెలుగులో హీరోయిన్ గా సినిమాలు ఆపేసింది.  ఈ విధంగా సాహస వీరుడు సాగర కన్య సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక మెరుపు మెరిసింది శిల్పా శెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: