సూర్య : ఆమెతో మళ్ళీ నటించాలని వుంది.. కానీ..?

murali krishna
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటించింది...అలాగే బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించారు యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన భారీ బడ్జెట్‌ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఇదిలా ఉంటే సూర్య తన 44వ చిత్ర షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు.స్టార్ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు.ఇదే క్రమంలో సూర్య తన 45 చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సినిమాకు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్‌ పైకి వెళ్లనుంది. 

ప్రస్తుతం కంగువా మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సూర్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..ఆ ఇంటర్వ్యూలో తన భార్య జ్యోతికతో కలిసి మళ్లీ నటించాలనే కోరిక కలగానే మారిందని ఆయన తెలిపారు...త్వరలోనే ఆమెతో కలిసి నటిస్తాను అని సూర్య తెలిపారు.అయితే మేము కలిసి నటించే సినిమా కథకు జ్యోతిక అయితేనే సెట్‌ అవుతుంది అనేలా పాత్ర ఉండాలి కానీ, ఏదో బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేయకూడదని తెలిపారు... తాను మాత్రం ఏ దర్శకుడిని తమ కోసం కథను సిద్ధం చేయమని అస్సలు కోరనని సూర్య తెలిపారు. ప్రస్తుతం నటి జ్యోతిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తుంది.. త్వరలోనే సూర్యతో కలిసి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.సూర్య నటించిన కంగువా సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. సినిమా కనుక హిట్ అయితే సూర్య క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: