బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ వరస పెట్టి తెలుగు సినిమాలలో నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ బ్యూటీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన వాల్టేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , ఇందులోని స్పెషల్ సాంగ్ కి కూడా మంచి గుర్తింపు రావడంతో ఈ నటికి తెలుగు లో అవకాశాలు వరుసగా పెరిగాయి. ఇక వాల్టేరు వీరయ్య సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంద సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ సినిమాలో కూడా ఈ స్పెషల్ సాంగ్‌లో నటించింది.
కానీ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ మూవీల ద్వారా ఈమెకు అత్యంత భారీ స్థాయిలో క్రేజ్ రాలేదు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ కి టైటిల్ ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్‌ను ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ ఎక్కువ శాతం ఐటమ్ సాంగ్ లలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈమెకు సూపర్ క్రేజ్ ఉండడంతో ఈమె నటిస్తున్న ఐటమ్ సాంగ్ లకి దాదాపు నిమిషానికి కోటి రూపాయలు చొప్పున పారితోషకాన్ని ఇస్తున్నట్లు అవుతుంది. దీనితోనే అర్థం అవుతుంది ఈ బ్యూటీ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంది అనేది.